సినిమా థియేటర్లు తెరవాల్సిన అవసరం ఉందా?

మహమ్మరి వైరస్ అందరికంటే ఎక్కువగా దెబ్బతీసింది సినిమా పరిశ్రమనే. ప్రస్తుతం అన్నింటికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఇవ్వలేదు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయనేది చెప్పరాకుండా ఉంది. నిన్ననే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో మంత్రి తలసానితో సినీ పెద్దలు మీటింగ్ కూడా నిర్వహించారు. దాంతోనూ పూర్తి స్పష్టత రాలేదు.

ఈ వైరస్-లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే సినిమా పరిశ్రమకు కోట్ల నష్టం వాటిల్లింది.  రెండు నెలలుగా అన్నీ మూతపడి ఘోరంగా దెబ్బతింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా థియేటర్స్ ను ఆగస్టు నెలలో మాత్రమే తెరవవచ్చని తెలుస్తోంది.  అనుమతులు ఇచ్చాక కూడా కేవలం రోజుకు  మూడు షోలు మాత్రమే వేయడానికి అనుమతి ఉంటుందని.. రాత్రి షోలకు అనుమతి ఉండదని సమాచారం.

జూన్ 1న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలానే ఉంటే కొన్ని పెద్ద సినిమాలకు ప్రభుత్వ నిర్ణయాలు శరాఘాతంగా మారనున్నాయి. దీంతో సినిమాలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
× RELATED 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందట..!
×