యాప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారాలా?

గత కొంతకాలంగా బాలీవుడ్ హాటీ రియా సేన్ ఇన్ స్టాగ్రామ్ లో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. నిరంతర ఫోటోషూట్లతో అంతకంతకు కుర్రకారు కంటికి కునుకు కరువయ్యేలా చేస్తోంది. ఈ అందాల నటి ఉద్ధేశమేంటో అర్థంగాక అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే రియా ఉన్నట్టుండి ఇలా చెలరేగిపోవడానికి కారణమేంటో తాజాగా రివీలైంది. ప్రస్తుతం ఈ భామ తన సొంత యాప్ ని మార్కెట్లోకి తెచ్చే ఆలోచనలో ఉంది. అందుకోసం ఇప్పటికే అఫీషియల్ యాప్ ను రెడీ చేయించిందట. ఇందులో తనకు సంబంధించిన సర్వ సమాచారంతో పాటుగా వాణిజ్య ప్రకటనల్ని వైరల్ చేస్తుందట. స్వామి కార్యం సకార్యం చక్కబెట్టే ప్లాన్ లోనే ఉందని సమాచారం.

అంతేకాదు ఈ యాప్ లో అభిమానులకు నేరుగా టచ్ లో ఉంటుందట. సోషల్ మీడియాను మరొక స్థాయికి తీసుకెళ్లడానికి.. ఒక సెలబ్రిటీగా మరొక స్థాయికి ఎదిగేందుకు ఇది ఒక మార్గం. అభిమానులతో హైపర్ పర్సనలైజేషన్ కి అవకాశం ఉంటుందని.. తనని చూడాలనుకునే వారు నేరుగా చూడొచ్చని రియా చెబుతోంది. నాతో ప్రత్యక్షంగా మాట్లాడాలనుకుంటే అందుకు అవకాశం ఉందని నేరుగా చాట్ చేయవచ్చని చెబుతోంది. నాతో ఏదైనా మాట్లాడొచ్చు.. దేనికైనా సులభంగా యాక్సెస్ ఉంటుందని చెప్పింది అమ్మడు.

ఇంతకు ముందెన్నడూ చూడని వీడియోలు.. కనిపించని వీడియోలు ఈ యాప్ లో షేర్ చేస్తుందట. ఇన్ స్టాగ్రామ్ లో.. మీరు ఎక్కువగా చిత్రాలు వీడియోలను చూస్తారు. ఇక్కడ మీరు ఐదు-ఆరు నిమిషాల వెబ్ సిరీస్ కి సంబంధించిన వీడియోలను చూస్తారు. నా గురించి ఫన్నీ ఎమోటికాన్లు ఉండబోతున్నాయి… వాటిని ‘రియాక్షన్స్’ అని పిలుస్తారని నేను భావిస్తున్నాను! నేను మీకు ఫ్యాషన్ .. మేకప్ సలహాలు ఇవ్వగలను…. మీ స్నేహితురాలిని ఎలా ఆకర్షించాలో నేను మీకు చెప్పగలను. మీకు ఎవరు మంచివారు  మీకు ఏది మంచిది కాదో కూడా చెబుతానని ఊరించేస్తోంది.

అంతేకాదు రియా లండన్ లో ఫ్యాషన్ బ్రాండింగ్ కోర్సు పూర్తి చేసిందట. ఎవరికి ఎలాంటి బ్రాండ్ కావాలి? ఇది ఫ్యాషన్ కి సంబంధించిన టిప్స్ ని ఈ యాప్ ద్వారా అందిస్తుందట. అదంతా సరే కానీ.. మరీ ఇలా యాప్ ప్రమోషన్ కోసం ఆ రేంజులో ఒంటిపై వలువలు వలిచేయాలా? ప్రతిసారీ అర్థనగ్న ఫోటోల్ని అభిమానులకు షేర్ చేయాలా? అంటూ ఫ్యాన్స్ ఒకటే కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. రియా లేటెస్టు గా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బటన్ లెస్ డిజైనర్ టాప్ తో టాప్ లేపేసింది రియా.
× RELATED 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందట..!
×