ఫ్యాన్స్ పడిన కష్టాన్ని చెప్పుకొని క్రెడిట్ కొట్టేస్తున్న డిజిటల్ ఎక్స్ పర్ట్స్..?

తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వచ్చిందంటే వారి ఫ్యాన్స్ చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద కటౌట్లు.. బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కటింగులు అంటూ హడావిడి చేస్తూ ఉంటారు. తమ ఫేవరెట్ హీరో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ కటౌట్లు ముందు బర్త్ డే వేడుకలు జరుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేటెస్టుగా తమ ఫేవరేట్ హీరోల ఫోటోలను అందరూ కామన్ డీపీలుగా పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా బర్త్ డేని సెలెబ్రేట్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా మధ్యమాలలో హ్యాష్ టాగ్స్ తో ట్రెండ్ చేసేస్తున్నారు. తమ అభిమాన హీరో కోసం నిద్ర పోకుండా తిండి తినకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. ఇతర హీరోల అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తుంటారు. వారికి ఆ హీరోతో ఎలాంటి రిలేషన్ లేనప్పయికి వారి కోసం ఎంతటికైనా తెగిస్తుంటారు.

ఇదిలా ఉండగా మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా #HappyBirthdayNTR #HappyBirthdayTarak అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దాదాపు 21 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్స్ చేస్తూ మోత మోగించారు. ఇది ఇండియాలోనే ఏ సినీ హీరో కూడా సంపాదించలేని రికార్డు అని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తనపై నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూ బర్త్ డే విషెస్ తెలిపిన వారందరికీ ఎన్టీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు 21 మిలియన్ ట్వీట్స్ వచ్చాయని ఎన్టీఆర్ ఫాన్స్ అంతా తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ కి ఉన్న స్టార్ డమ్.. అలానే 'ఆర్.ఆర్.ఆర్' వల్ల ఇటు నుంచి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడయ్యి ఎన్టీఆర్ ఈ రికార్డు సృష్టించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రికార్డ్ కోసం అభిమానులు ఇతర హీరోల ఫ్యాన్స్ తో ఫైట్ చేస్తూ ట్వీట్స్ చేసుకొని రికార్డ్ సృష్టించారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ పడిన కష్టాన్ని సో కాల్డ్ డిజిటల్ ఎక్స్పర్ట్స్ ఈ రికార్డ్ కి మేమే కారణంగా అంటూ హీరో దగ్గర క్రెడిట్ కొట్టేస్తున్నారట. ఇదంతా తామే చేసాము అని ఆ డిజిటల్ ఎక్స్పర్ట్స్ హీరో దగ్గర భీరాలు పోతున్నారట. ఇది తెలిసిన కొంతమంది ఎందుకు నాయనా మిగతా హీరోల ఫ్యాన్స్ తో ఈ అనవసరమైన గొడవలు.. మీరు పడిన కష్టాన్ని ఎవరో ఇంకొకరు క్యాష్ చేసుకుంటుంటే..ఇప్పటికైనా మారండి అని సోషల్ మీడియా వేదికగా సలహా ఇస్తున్నారు.
× RELATED 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందట..!
×