టాప్ స్టోరి: సమ్మర్ సారక్కలు వ్వాటే ట్రెండ్

ఫ్యాషన్ ఏదైనా సౌకర్యం చాలా ముఖ్యం. సీజన్ ని బట్టి ఎంపిక ఉండాలి. ఈ విషయంలో నేటితరం యూత్ కి పెద్దగా చెప్పనవసరం లేదు. అయితే మన సెలబ్రిటీల నుంచి స్ఫూర్తి పొందితేనే ఇలాంటి ఐడియాలు వస్తుంటాయి. ఆలియా .. దిశా పటానీ.. మొదలు నేటితరం నటీమణుల వరకూ సమ్మర్ ఫ్యాషన్స్ ని ఫాలో చేయడంలో ఎక్కడా తగ్గడం లేదు మరి. ఇంతకుముందులా టైట్ ఫిట్లు వేసుకుని జిమ్ముకెళ్లినట్టు వెళ్లకుండా బయటికి వస్తే కాస్త లూజుగా ఉండేవి తొడుక్కుంటున్నారు. కొత్త ఫ్యాషన్స్ తో ఎదుటివారికి చెమటలు పట్టించేస్తున్నారు.

ఆ కోవలో ఈ చక్కనమ్మల తీరుతెన్నులు పరిశీలిస్తే చాలా సంగతులే తెలిశాయి. దిషా పటాని .. అలియా భట్ సహా బి-టౌన్ దివాస్ ని పరిశీలిచి ఆ ఫ్యాషన్స్ ని అనుకరిస్తే మిమ్మల్ని మీరు వేసవిలో అనూహ్యంగా డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఈ వేసవిలో అధునాతన దుస్తులతో కాపాడుకోవచ్చు. ఇదిగో ఈ B- టౌన్ దివాస్ ని చూస్తే.. ప్రేరణ పొందవచ్చు. ప్రస్తుతం దిశా .. ఆలియానే కాదు.. బాలీవుడ్ లో కెరీర్ పరంగా స్వింగులో ఉన్న జాన్వీ.. అనన్య పాండే.. ఆలియా దుస్తుల తీరుతెన్నులు చూస్తే ఆసక్తి కలుగుతోంది.

తాజా ఫోటోషూట్ లో దిషా పటాని తెలుపు - నీలం పూల ముద్రణ కలిగి ఉన్న దుస్తుల్ని ధరించి ట్రెండీగా కనిపిస్తోంది. ఈ దుస్తులలో రఫుల్ స్లీవ్ .. వెనుక భాగంలో క్రిస్-క్రాస్ డిజైన్ మైమరిపిస్తున్నాయి. సన్నీ కిస్ లుక్ ఈ చిత్రంలో అందంగా కనిపిస్తోంది.

సొట్ట బుగ్గల అలియా భట్ వేసవిలో అధునాతన ఎంపికలతో ఆకట్టుకుంటోంది. ర్యాప్-డ్రెస్ ... వీ-నెక్ లైన్ .. దానికి తోడు ఫుల్ స్లీవ్స్ తో అదరగొట్టింది. సాధారణంగా డే-అవుట్ లేదా బ్రంచ్ కోసం ఈ లుక్ చాలా బాగుంటుంది. యూత్ ఆలియాని ఫాలో చేసేది ఇందుకేనేమో!

అనన్య పాండే .. మినీ-లంగా ఫ్లవర్ ప్రింటెడ్ లుక్ తో మైమరిపిస్తోంది. తెల్లటి టాప్ ధరించి తేనెటీగను తలపిస్తోంది. హోప్స్ చెవిపోగులు .. నల్ల సన్ గ్లాసెస్ అనన్య అందాన్ని హైలైట్ అయ్యేలా చేశాయి. శ్రద్ధా పూల డిజైన్ అంతే ఆకట్టుకుంటోంది. పొడవాటి ఫ్లవరిష్ లంగాతో లిలక్ కలర్ టాప్ ధరించి చూడచక్కగా కనిపిస్తోంది. ఆమె లుక్ స్పెషల్ హీల్స్ ధరించి ప్రత్యేకంగా కనిపిస్తోంది.

పసుపు వేసవి రంగు కాబట్టి కరీనా కపూర్ ట్రెండీ లుక్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఆ ముందు భాగంలో చీలికతో వచ్చిన ఈ లేత పసుపు కటౌట్ హైలైట్ గా కనిపిస్తోంది. బ్రౌన్ హీల్స్ లుక్ ఆకట్టుకుంది.
కరీనా కపూర్ నుండి మలైకా అరోరా.. గౌరీఖాన్ సైతం లాక్ డౌన్ సమయంలో ధరించేవి ఈ తరహావే.
× RELATED పూనమ్ కౌర్ పీకే లవ్.. శ్రీరెడ్డి పంచ్!
×