తన పనైపోయిందన్న వారికి ఘాటుగా రిప్లై ఇచ్చిన మిల్కీ బ్యూటీ

మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ తమన్నా. తర్వాత వచ్చిన 'హ్యాపీడేస్' సినిమాతో అమాంతం క్రేజ్ పెంచేసుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరు హీరోలతో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ సినిమా చిన్నదా పెద్దదా అనే బేధాలు లేకుండా నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారింది. సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో తమన్నా ఒక్క ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు అంటేనే తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మకి ఉన్న క్రేజ్. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. గత ఏడాది 7 సినిమాల్లో నటించిన తమన్నా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో మహేష్ బాబు పక్కన డాంగ్ డాంగ్ అనే పాటలో చిందులేసింది.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా జయాపయాల తో సంబంధం లేకుండా వరుస అవకాశాల తో దూసుకుపోతోంది. అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తమన్నా ఎందుకో గాని అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ తెలుగులో మాత్రం ఎదో ఒక పనితో బిజీ అవుతూనే ఉంది. ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగు తమిళ్ హిందీలలో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య ఆమె అవకాశాలు తగ్గుతున్నాయని తమన్నా పని అయిపోయిందని.. టాలీవుడ్ -కోలీవుడ్ ని వదిలే పరిస్థితి ఏర్పడిందని ఇక గొప్ప కోసమే బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా రిజెక్ట్ చేసినట్లుగా తమన్నా ప్రచారం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోని తమన్నా ఈ రూమర్ పై అసహనానికి గురయ్యిందట.

లేటెస్టుగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది. మీడియాలో వస్తున్న రూమర్స్ కు తమన్నా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. బాలీవుడ్ లో నేను నటించనిది నాకు పని దొరక్క కాదని.. వర్సటైల్ పాత్రలు రాకపోవడంతో ఆ మూస ధోరణి క్యారెక్టర్లు చేయలేక అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయని చెబుతూ.. బాలీవుడ్ కి ఇప్పుడిపుడే తాను అలవాటు పడుతున్నట్లు తెలిపింది. వాస్తవానికి తనకు బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా లక్ కలిసొచ్చిందని చెప్పుకొచ్చిందట. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధికీ తో 'బోలే చుడియా' సినిమాలో నటిస్తోంది.
× RELATED పూనమ్ కౌర్ పీకే లవ్.. శ్రీరెడ్డి పంచ్!
×