ఆ హీరో పాన్ ఇండియా ప్లాన్ ఏ ధైర్యంతో చేస్తున్నాడో..!

టాలీవుడ్ నుండి ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ లు కాబోతున్నారు. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ అదే లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. పూరి సినిమాతో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనున్నాడు విజయ్. అయితే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటి నుంచో ఈ పాన్ ఇండియా క్రేజ్ మీద కన్నేశాడట. సౌత్ ఇండియన్ స్టార్ అని ఇదివరకే సినీ అభిమానులు తేల్చేసారు. కేరళలో బన్నీకి క్రేజ్ వుంది. కర్ణాటక - తమిళనాడు మన హీరోలందరికీ అంతో ఇంతో మార్కెట్ వుంది. అందువల్ల ఏదో విధంగా నడుస్తుందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆల్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టినట్లు అన్పిస్తుంది.

యూట్యూబ్ ద్వారా ఎలాగో బన్నీ సినిమాలు హిందీలోకి డబ్ అవుతుంటాయి. నార్త్ ఇండియా జనాలకు బన్నీ కేవలం యూట్యూబ్ ద్వారా మాత్రమే పరిచయం. ప్రస్తుతం సుకుమార్ తో చేసే పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు కూడా సినిమా ఫస్ట్ లుక్ నుంచే ప్రారంభించేసారు. ఫస్ట్ లుక్ నుంచే పుష్ప అనే టైటిల్ ను అన్ని భాషల్లో కంపోజ్ చేయించి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే - ప్రభాస్ - ఎన్టీఆర్ - చరణ్ ల కన్నా తానేం తక్కువ కాదని సుకుమార్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. తమిళం నుండి విజయ్ సేతుపతి - కన్నడ నుండి రష్మిక ఉన్నారు ఓకే. మలయాళంలో బన్నీకి క్రేజ్ ఉంది. మరి నార్త్ లో ఏ ధైర్యంతో ప్లాన్ చేస్తున్నారో.. జవాబు తెలియని ప్రశ్న. మొత్తం మీద బన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అవుతాడా.. లేక ఏం అవుతుంది అనేది ఆసక్తి రేపుతున్న అంశం.
× RELATED పాయల్ పాప పై శంకర్ కన్ను పడిందా...?
×