ఆ హీరోయిన్ కి తెలుగులో నిలబడే దమ్ముందా..?

కొందరు హీరోయిన్లు ఉంటారు.. వాళ్లకు పని తప్ప మరోకటి తెలియదు. అయినా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో 24 గంటలు కష్టపడినా కూడా మహా అయితే రెండు మూడేళ్ల కంటే ఎక్కువగా నిలబడటం లేదు హీరోయిన్లు. దాంతో దొరికిన ఛాన్సులను కళ్లకు అద్దుకుని తీసుకుంటున్నారు. అందుకోసమే కష్టపడుతున్నారు.. ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా అదే చేస్తోంది. గతేడాది 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ అనన్య పాండే. ఏడాది కాలంగా బాలీవుడ్లో ఈమె పేరు బాగానే వినిపిస్తుంది.

అందాల ఆరబోతకు తోడు మంచి అభినయం కూడా ఈమె సొంతం. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు ఈమె. గ్లామర్ షోకు కూడా ఏ మాత్రం తీసిపోకుండా అన్నిటికి సిద్ధమే అంటుంది అనన్య. సినిమా అంటే ప్రాణం కాబట్టి సినిమా కోసం ఎంత పని చేయమన్నా చేస్తానంటుందట.

ఇలాంటి వర్క్ డెడికేషన్ ఉన్న హీరోయిన్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు అంటూ చిత్రయూనిట్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా అనన్యను నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మడు తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకుడు.

తెలుగు ఇండస్ట్రీకి వస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్తుంది అనన్య. కానీ తెలుగులో బాలీవుడ్ హీరోయిన్స్ కి చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఎందుకంటే లోఫర్ సినిమాతో వచ్చిన దిశా పటాని సాహోతో వచ్చిన శ్రద్దా కపూర్ లు ఒక్క సినిమా చేసి మళ్లీ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వస్తున్న అనన్య అయినా తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అవుతుందా? లేక ఈమె కూడా ఒక్క సినిమాతోనే కన్పించకుండా పోతుందా? అనే సందేహాలు సినీ వర్గాలలో రేకెత్తుతున్నాయి. చూడాలి మరి అనన్య కెరీర్ ఎలా ఉండబోతుందో..
× RELATED ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్...?
×