నాకు తెలుగులో నటించడమే ఇష్టమంటున్న టాప్ హీరోయిన్

మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలీవుడ్ - టాలీవుడ్ - బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా సక్సెస్ అయింది. అయితే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నది మాత్రం తెలుగు తమిళంలోనే. మిల్కీ బ్యూటీగా ఫేమస్ అయిన తమన్నా.. నటిగా దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. అయితే నటిగా తమన్నాకు పదిహేనేళ్ల సినీ కెరీర్ పూర్తి కావస్తుంది. మొన్న రానాకు పదేళ్లు - ఆపై సమంతకు పదేళ్లు అంటూ సోషల్ మీడియాలో హంగామా చేశారు. ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక తమన్నా కూడా నటిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆమె పై కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి.

2005లో పదిహేనేళ్ల ప్రాయంలో సినీ కెరీర్ ను ప్రారంభించింది తమన్నా. బాలీవుడ్ చిత్రం చాంద్ సే రోషనన్ చెహ్రా అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగేట్రం చేయగా.. తెలుగులో శ్రీ (2005) - తమిళంలో కేడీ(2006) అనే చిత్రం ఎంట్రీ ఇచ్చింది. హార్డ్ వర్క్ - నిజాయితీని నమ్ముకున్న తమన్నా తెరపై అలా మెరుస్తూ వస్తుంది. ఆమె అందం చూస్తే కళ్లు తిప్పుకోలేరు. అలాంటి తమన్నా పై ఈ మధ్య సినిమాల్లో సరిగ్గా కనిపించడం లేదని - అవకాశాలు తగ్గాయని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఎలాంటి రూమర్స్ అయినా పెద్దగా పట్టించుకోని తమన్నా.. అవకాశాలు తగ్గాయి అనే రూమర్ పై ఘాటుగా స్పందించిందట. ఎవరన్నారు నాకు అవకాశాలు లేవని?  ప్రస్తుతం తన చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయని చెప్పింది. కొసమెరుపుగా తెలుగులో చేయడానికే ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తున్నట్టు తమన్నా తెలిపింది.


× RELATED అమ్మడికి ఒంటిమీద నూలుపోగు ఉన్నా సెడ్డసిరాకు బాబా!
×