వయసైన హీరోతో పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో అఫైర్స్ గోల ఎప్పుడూ ఉండేది. కానీ సినీ అభిమానులకు ఇష్టమైన విషయం కూడా సెలబ్రిటీల అఫైర్స్ గురించి తెలుసుకోవడమే. ముఖ్యంగా ఎఫైర్లతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక యంగ్ హీరోయిన్ ప్రేమ వ్యవహారం కూడా తమిళ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ హీరోయిన్. ఆ తర్వత ఆమెకు పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో తమిళం వైపు మొగ్గు చూపింది. అక్కడ సినిమా ఛాన్సులు బాగానే వచ్చినా పేరు మాత్రం రాలేదు. ఈలోపే అక్కడున్న ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ హీరోకి ఇదివరకే పెళ్లి కూడా అయ్యిందట. ఆ తర్వాత రెండేళ్లకే అతడు భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడట. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట.

దీంతో ఎప్పటినుండో ఇద్దరిపై అనేక రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు వీరిద్దరూ. ఆ హీరోయిన్ ప్రేమించింది ఎవరో కాదు ఒక తమిళ హీరోనే. ఒక టాప్ దర్శకుడికి ఆ హీరో తమ్ముడు అవుతాడట. 2016లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒక సినిమా షూటింగ్ లో హీరోయిన్ తో ప్రేమయాణం స్టార్ట్ చేసాడు.

హీరోకు ఇదివరకే పెళ్లి కావడంతో ఆమె కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అతడు హీరో అయినప్పటికీ పెళ్లి అయ్యి విడాకులు కూడా తీసుకోవడం వారికి నచ్చలేదు. రెండో పెళ్లివాడితో ప్రేమ ఏంటని నిలదీశారు. దీంతో ఆమె కుటుంబసభ్యులకు నచ్చచెప్పిందట. చివరకు ఈ వ్యవహారానికి చెక్ పెట్టేందుకు హీరో-హీరోయిన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. అసలైతే ఏప్రిల్ లొనే పెళ్లి పీఠలెక్కలని అనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా పెళ్లి నిర్ణయం కాస్త పోస్ట్ పోన్ చేశారట. చూడాలి మరి ఈ హీరో-హీరోయిన్ల ప్రేమ ఎంతవరకు సాగుతుందో..
× RELATED తారక్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే...?
×