ఫోటో స్టోరీ: బికినీలో ఊర్వశియిజం

బాలీవుడ్ లో తమ హాట్ నెస్ తో మంటలు రేపే హాటీల లిస్టులో ఊర్వశి రౌతేలా పేరు తప్పని సరిగా ఉంటుంది. ఇప్పటికే ఓ అర డజను హిందీ సినిమాల్లో నటించిన ఈభామకు మోడలింగ్ నేపథ్యం ఉంది. మనం ఎంత సులువుగా వాట్సాప్ మెసేజ్ చూస్తామో..అంత అలవోకగా ఈ భామ ఫోటో షూట్ చేస్తుంది. ఇక గ్లామర్ విషయంలో పాపకు ఏమాత్రం పిసినారితనం లేదు. అందుకే అందాలను వడ్డించడంలో ఇప్పటికే ఫీల్డులో ఉన్న సీనియర్ హాటీలకు గట్టి పోటీ ఇస్తుంది.

లాక్ డౌన్ అనగానే కొందరు దిగులు పడ్డారు. బయటకు వెళ్లే అవకాశం లేదని డీలాపడిపోయిన కొందరు సెలబ్రిటీలు పెద్దగా అప్డేట్లు ఇవ్వడం లేదు. కానీ ఊర్వశి మాత్రం 'జీవితం క్షణ భంగురం'.. 'జీవితం బుద్భుదప్రాయం' అనే పాతకాలం తెలుగు సామెతలకు సరిపోయే హిందీ సామెతలను ఫాలో అవుతుందో ఏమో కానీ యమా ధైర్యంగా ఉంటోంది. పోయేవాళ్ళం ఎలాగూ పోతాం.. కానీ పోయేలోపు నెటిజన్లకు వీలైనంత గ్లామర్ పంచాలి. చేతనైనంత హాట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయినట్టుంది. అందుకే లాక్ డౌన్ ఉన్నప్పటికీ రోజూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరినీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతోంది. సాటి హాటు భామల సమాజానికి గ్లామర్ సందేశం ఇస్తోంది.

తాజాగా ఈ భామ ఒక ఫోటో పోస్ట్ చేసింది. కొత్త ఫోటోనా లేక పాత ఫోటోనా అనేది వెల్లడించలేదు. ఈఫోటోకు "ప్రేమకు విషం అనే పేరుపెట్టాలి & ఎలాగూ మనం దాన్ని తాగుతాము" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సరే ఊర్వశి మనసులో ఏం అనుకుని ఆ క్యాప్షన్ ఇచ్చిందో అర్థం అయినంత అర్థంచేసుకోండి. ఫోటో విషయానికివస్తే ఎంతో వయ్యారంగా ఓ బ్లాక్ మోనోకిని ధరించి...అందాలను టోకుగా వడ్డించింది. మెడలో అదేదో ఓ వెరైటీ దండ కూడా వేసుకుంది. ఇక ఆ భంగిమ మామూలుగా లేదు. మూడు గంటల్లోనే ఈ ఫోటోకు ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. ఊర్వశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే'వర్జిన్ భానుప్రియ' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
× RELATED అమ్మడికి ఒంటిమీద నూలుపోగు ఉన్నా సెడ్డసిరాకు బాబా!
×