సూపర్ స్టార్ సినిమా అందుకే ఆగిందా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కొన్నేళ్లుగా సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా సూపర్ స్టార్ చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. అదేంటంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాతో అతడి ఖాతాలో భరత్ అనే నేను మహర్షి తర్వాత హ్యాట్రిక్ హిట్ నమోదైంది. ఈ క్రమంలోనే మహేష్ తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

మహేశ్ కోసం అతడు మాఫియా బ్యాగ్డ్రాప్ ఉన్న స్క్రిప్టును రెడీ చేశాడని ప్రచారం జరిగింది. ఈ మూవీలో సూపర్ స్టార్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నాడని వార్తలు కూడా వచ్చాయి. వంశీ పైడిపల్లితో సినిమా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మహేశ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సరైన కారణాలైతే తెలియలేదు కానీ ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. దీంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వంశీ పైడిపల్లి - మహేశ్ బాబు చేద్దామనుకున్న సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనంటూ తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

దీని ప్రకారం.. మహేశ్ బాబు ఈ సినిమాకు పారితోషికం ఎక్కువ అడిగినట్లు ప్రచారం జరిగింది. దీంతో దర్శకుడు వంశీ అంత బడ్జెట్ కష్టమని ఆపినట్లు వార్తలొచ్చాయి. ఈ కారణంగానే సినిమాను కొద్ది రోజులు ఆపేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గ్యాప్ లో మహేష్ కొత్త దర్శకుల నుండి కథలు కూడా వింటున్నారని తెలుస్తుంది. దాదాపు గీతగోవిందం డైరెక్టర్ పరుశురాం తో మూవీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కానీ వంశీతో సినిమా ఆగడానికి కారణం మాత్రం సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికే ఆపినట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సివుంది. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమాలన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. మహేష్ కి ఇంకా నెక్స్ట్ సినిమా ఓకే చేయడానికి చాలా టైం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి.
× RELATED పూనమ్ కౌర్ పీకే లవ్.. శ్రీరెడ్డి పంచ్!
×