అవకాశాలు లేకపోయినా ఢోకా లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో ఒక్క సినిమాతో కుర్రకారు హృదయాలను దోచుకున్న హీరోయిన్స్ ఎంతో మంది ఉంటారు. ఒక సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె అందరికీ కలల రాణి అయిపోయింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ నిర్మాత కూతురు. ఓ మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమై 2016లో మన ముందుకు వచ్చింది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఇండస్ట్రీ వారంతా కూడా ఇండస్ట్రీలో ఇక ఫ్యూచర్ అంతా ఆ అమ్మాయిదే అనుకున్నారు. దక్షిణాది సినిమాల్లోని లేటెస్ట్ హీరోయిన్స్ అందరికీ కూడా గట్టి కాంపిటేషన్ ఇస్తుందని అనుకున్నారు. అందరూ ఇలా ఆమె గురించి ఏవేవో అనుకున్నారు. కానీ ఇప్పుడు "అనుకున్నది ఒక్కటి ..అయినది ఒక్కటి ..బోల్తా పడ్డావు లే బుల్ బుల్ పిట్ట" అన్నట్లుగా మారింది ఆమె పరిస్థితి.

ఆమె వచ్చిన కొత్తలో హైదరాబాద్ వచ్చినప్పుడు హీరోలంతా కూడా ఆమెనే తమ సినిమాలో నటింపచేయాలని పోటీలు పడ్డారు. మొదటి సినిమా తనకి స్టార్ హీరోయిన్ గా ఒక తిరుగులేని ఇమేజ్ ని తీసుకు వస్తుందని మొదటి సినిమా విడుదలయ్యాక కోట్లలో పారితోషకం అందుకుంటానని మెరుపుకలలు కన్నట్లుంది. తన కెరీర్ పై ఎంతో.. ఆశపడ్డ ఆ హీరోయిన్ ఆశలపై చేసిన సినిమాలన్నీ నీళ్లు చల్లాయి. ఇక అప్పటి వరకు ఆఫర్లతో ఆమెకోసం ఎదురు చుసిన నిర్మాతలు ఎవరూ కూడా ఆమె వంక కన్నెత్తి చూడట్లేదట. నాకేంటి హైదరాబాద్ లో ఇల్లు ఉంది కొత్తగా రేంజ్ రోవర్ కార్ కొన్నా.. నాకు తగ్గట్టు టాప్ హీరోల సినిమా అవకాశాలు వస్తే చేస్తానంటుందట ఈ బ్యూటీ. ఇప్పుడు తనని చూసిన వారు "దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పుగాదు కానీ అదే దీపంతో ఇంటిని తగల పెట్టుకోవడమే తప్పు"అంటున్నారు. ఇక నుండైనా జాగ్రత్తగా ముందుకు వెళితే మున్ముందైనా లాభం ఉంటుందని అంటున్నారు.
× RELATED అజయ్ భూపతి 'మహా సముద్రం'లో హీరోలు వారేనా...?
×