తబ్లిగీ సభ్యులను మరో క్వారంటైన్ సెంటర్ కి మార్చండి..!

కరోనా దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇకపోతే ఢిల్లీని మర్కజ్ ప్రార్థనలకు హాజరైన కొంతమందిని ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియాలోని స్కూల్ ను క్వారంటైన్ కేంద్రం గా మార్చి అక్కడికి తరలించారు. అయితే వారిని అక్కడి నుండి వేరే చోటుకు మార్చాలని ఆ ఏరియా స్థానికులు ఆందోళనకు దిగారు.  క్వారంటైన్ సెంటర్ ను తక్కువ జనాభా ఉన్న ఏరియాకు మార్చుకోవాలంటూ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ - సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాసింది.

గులాబీ బాగ్ గవర్నమెంట్ ఫ్లాట్స్ RWA ప్రెసిడెంట్ సంజీవ్ భరద్వాజ్ మాట్లాడుతూ...ఈ ఏరియాలో 15వేలమంది నివాసం ఉంటున్నారు. క్వారంటైన్ సెంటర్ గా మార్చిన స్కూల్ రెసిడెన్షియల్ ఫాట్ ల మధ్యలో ఉంది. ఒకవేళ తబ్లిగీ జమాత్ సభ్యులను కనుక వెంటనే వేరొక చోటుకి మార్చకపోతే - ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీసెస్ లో నిమగ్నమైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఈ ఏరియా తదుపరి కరోనా హాట్ స్పాట్ గా మారుతుంది అని అయన హెచ్చరించారు. మంగళవారం ఇద్దరు తబ్లిగీ జమాత్ సభ్యులు క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు దొరికిపోయారు. దీనితో వారు భయంతో వణికిపోతున్నారు.

ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉమేష్ భత్రా లెఫ్టినెంట్ గవర్నర్ - సీఎం కేజ్రీవాల్ కు రాసిన లేఖలో...15వేలమంది కుటుంబసభ్యులతో కలిసి2500ఆఫీసర్లుఅధికారులు గులాబి బాగ్ ఏరియాలో నివసిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న చాలా మంది సిబ్బంది  కరోనా పై పోరాడే అత్యవసర విధుల్లో ఉన్నారన్న విషయం మరిచి ప్రస్తుతం - 120 మంది తబ్లిగీ సభ్యులు ఇక్కడున్న పాఠశాలకు క్వారంటైన్ కోసం పంపబడ్డారు. ఆ క్వారంటైన్ కేంద్రం చుట్టూ ఉన్న నివాసితులు మరియు వారి కుటుంబ సభ్యుల్లో టెన్షన్ నెలకొంది అని బాత్రా చెప్పారు. ఇకపోతే గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరై అదే బిల్డింగ్ లో ఉండిపోయిన 2340మందిని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం క్వారంటైన్ కు తరలించిన విషయం తెలిసిందే.

× RELATED 7వేల మందిని తొలగించిన ప్రపంచ అతిపెద్ద విమాన తయారీ సంస్థ
×