నెల రోజుల బిడ్డతో విధులకు హాజరైన జీవీఎంసీ కమిషనర్!

కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఈ కరోనా కి సరైన మందు లేకపోవడం - రోజురోజుకి మరింతగా విజృంభిస్తుండటంతో  - కరోనాను అరికట్టడానికి మరో మార్గం లేక దేశ వ్యాప్తంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్ డౌన్ ను విధించాయి. దీనితో దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ కరోనా పేషేంట్స్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు - వైద్య సిబ్బంది - పోలీసులు - పలువురు ప్రభుత్వ అధికారులు కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు విధుల్లోనే ఉంటూ కరోనా నుండి ప్రజలని కాపాడటానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

ఈ సమయంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ సృజన కూడా ఇలాంటి క్లిష్టమైన సమయంలో తన అంకితభావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికి పైగా ప్రజలకు ఈమె ఇప్పుడు  జవాబుదారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో  తాజాగా ఒక నెల క్రితం ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చినా కూడా నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజు అధికారులు - సిబ్బందితో సమీక్ష చేస్తూ - ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఒకచేతిలో పసికందును ఎత్తుకొని - మరోవైపు అధికారులకి సూచనలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో ఒకవైపు తల్లిగా ..మరోవైపు కమిషనర్ పై రెండు బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆమె పై  నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సమయంలో ఆమె తన బిడ్డ చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఆమె.. తన మాతృత్వ  సెలవులని సైతం వదిలిపెట్టి - ప్రజలో కోసం - కరోనా నివారణ కోసం విధుల్లో చేరారు. మొదటి మూడు వారాలు సృజన తన బిడ్డను ఇంట్లోనే వదిలేసి ఆఫీసుకు వచ్చారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త - తల్లికి వదిలేశారు. ఆమె మద్య - మధ్యలో బిడ్డను చూడటానికి వెళ్లొచ్చేవారు. దీనిపై ఆమెని అడగ్గా ..కరోనాతో విశాఖవాసులు ఆందోళనలో ఉన్నారని.. వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యతపై తమపై ఉందంటున్నారు సృజన. అందుకే తాను ఈ కష్ట సమయంలో అండగా ఉండాలని విధులకు వస్తున్నాను అంటున్నారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని.. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దంటున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత రానివ్వమని.. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
× RELATED 7వేల మందిని తొలగించిన ప్రపంచ అతిపెద్ద విమాన తయారీ సంస్థ
×