మాజీ ఎమ్మెల్యే మృతి..విషాదంలో సీఎం !

సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే - టీఆర్ ఎస్ పార్టీ  సీనియర్ నేత కావేటి సమ్మయ్య కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 2009 - 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన టీఆర్ ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆ తరువాత కొద్దిరోజులకే అయన టీఆర్ ఎస్ పార్టీలో చేరారు.

సమ్మయ్యకు భార్య - ముగ్గురు కుమారులు ఉన్నారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల ఆయన కుటుంబీకులు - నియోజకవర్గ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా కావేటి సమ్మయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సమ్మయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు - పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
× RELATED ట్రంప్ ట్విటర్ మధ్య యుద్ధం.. ఘాటుగా స్పందించిన సీఈఓ
×