కరోనాకు వ్యాక్సిన్ సిద్ధం:గుడ్ న్యూస్ తెలిపిన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం

మానవ ప్రపంచం కరోనా వైరస్ తో సతమతమవుతోంది. ఆ వైరస్ నివారణకు మాత్రలు లేకపోవడంతో ఆ వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని 208 దేశాలకు ఆ వైరస్ పాకడానికి కారణమైంది. కంటికి కనిపించని శత్రువుగా ఆ వైరస్ మారింది. ఆ వైరస్ను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చికిత్స - వ్యాక్సిన్ గానీ లేదు. ఐసోలేషన్ -భౌతిక దూరంతోనే ఇప్పటివరకు కట్టడి చేస్తున్నారు. అయితే తాజాగా ఆ వైరస్ నివారణకు మాత్ర కనుక్కున్నామని ఆక్ఫఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఆ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఓ శుభవార్త తెలిపారు.

ఇంగ్లాండ్లో ఉన్న ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకలు ఆరు నెలల్లో కరోనా వైరస్కు వ్యాక్సిన్ సిద్ధం చేసే పనిలో ఉన్నారంట. ఈ మేరకు పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయని ప్రకటించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 500 మంది వాలంటీర్లపై ఆ వ్యాక్సిన్ పై పరిశోధనలు జరుగుతాయని - కచ్చితమైన డోస్ తో వ్యాక్సిన్ను విడుదల చేస్తామని ప్రకటన చేశారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాలంటీర్లు తమపై పరిశోధనకు ముందుకు వచ్చి సంతకాలు చేసినట్టు బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు వెల్లడించారు. దీంతో త్వరలోనే ఆ వైరస్ అందుబాటులోకి వస్తుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

అయితే ఈ వ్యాక్సిన్ ను మొదట చైనాకు చెందిన వలంటీర్లపై ప్రయోగం చేశారంట. వారంతా 14 రోజుల ఐసోలేషన్ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడడంతో పరిశోధకుల్లో ఆనందం వెల్లివిరిసింది. అనంతరం మరోసారి పరిశీలించేందుకు మొత్తం 108 మందిపై పరిశోధనలకు సిద్ధమయ్యారు. వీరిలో 18 మంది పరిశీలన పూర్తి కావడంతో వారంతా కరోనా నుంచి బయటపడ్డారంట. మరో ఆరు నెలల పాటు వీరి నుంచి రక్త నమూనాలు సేకరిస్తూ పరిశోధనలు చేసి కచ్చితమైన డోస్తో వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఆ విశ్వవిద్యాలయ ప్రతినిధులు చెబుతున్నారు.

అయితే వ్యాక్సిన్ విడుదల చేసిన అనంతరం కూడా నిర్ధారణ కోసం పలు దేశాల్లో కూడా పరీక్షలు చేస్తామని ఆ వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే చైనా - భారతదేశంలో కూడా కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పరిశోధనలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయ పరిశోధకులు -శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. వీలైనంత త్వరగా కరోనా వైరస్ కనుగొనే పనిలో అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఎవరు త్వరగా వ్యాక్సిన్ కనుగొంటారనే ఆసక్తి ఏర్పడింది. అలాంటి వారికి ఆయా దేశాలతో అంతర్జాతీయ సంస్థలు కూడా సహకరిస్తున్నాయి.
× RELATED 7వేల మందిని తొలగించిన ప్రపంచ అతిపెద్ద విమాన తయారీ సంస్థ
×