ట్రంప్ సార్ జోక్ చేస్తున్నారా?

‘‘ఉట్టికి ఎగరలేనమ్మా.. స్వర్గానికి ఎగురుతానందట.. వెనుకటికి ఒక ఆవిడ..’’ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికాలో మరణ మృదంగం వాయిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 10వేల కేసులకు పైగా మరణించారు. బుధవారం ఏకంగా 1000 మందికి పైగా మరణించారు. డేంజర్ జోన్ లో ఉన్న అమెరికా ఇప్పుడు కరోనాను కంట్రోల్ చేయడం మాని పరాయి దేశాలకు నీతి సూత్రాలు వల్లించడమే విడ్డూరంగా ఉంది.

తాజాగా కరోనా కారణంగా భారత్ లో కేవలం 650కి పైగా కేసులు మాత్రమే నమోదయ్యాయి. గురువారం నాటికి కేవలం 11 మరణాలే చోటుచేసుకున్నాయి. అదే అమెరికాలో ఇప్పటికే కేసుల సంఖ్య 68211కు దాటగా.. 24 గంటల్లోనే మరణాలు 1027 నమోదయ్యాయి.. అమెరికన్లు బతుకుభయంతో హడలి చస్తున్నారు. ప్రపంచంలో ఇటలీ తర్వాత అత్యధిక కేసులు మరణాలు చోటుచేసుకుంటున్న రెండో  దేశంగా అమెరికా చేరువ అవుతోంది.

అంతటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా దేశం ఉంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.  

తాజాగా ట్రంప్ మాట్లాడుతూ కరోనా వైరస్ తో భారత్ చేస్తున్న పోరాటానికి తాము సహాయం చేస్తామని ప్రకటించారు. భారత్ కు కావాల్సిన వైద్య సహాయం చేస్తామని  హామీ ఇచ్చారు. అటు ఇరాన్ కు కూడా తాము వైద్య సహాయం చేస్తామని ప్రకటించినా..  ఆ దేశం అందుకు ఒప్పుకోలేదని ట్రంప్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో కావాల్సింది డబ్బులు కాదని.. వైద్య సహాయం మాత్రమే అని ట్రంప్ సన్నాయినొక్కులు నొక్కారు

అయితే ట్రంప్ ప్రకటన నవ్వుల పాలైంది. కుప్పలు కుప్పలుగా అమెరికాలో మనుషులు చనిపోతుంటే భారత్ కు హెల్ప్ చేస్తానంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. కరోనా మరణాలను డైవర్ట్ చేయడానికే ట్రంప్ ఇలా డ్రామాలు ఆడుతున్నాడని కౌంటర్ ఇస్తున్నారు. ఇదంతా వచ్చే ఎలక్షన్స్ స్టంట్ అని కూడా విమర్శిస్తున్నారు. అమెరికాలో వెంటీలేటర్స్ లేక కరోనాతో చనిపోతుంటే.. ఇతర దేశాలకు వైద్య సహాయం చేస్తానంటున్న ట్రంప్ తీరును అమెరికన్లు కడిగిపారేస్తున్నారు. ముందు మన దుకాణం సరిగా చేయి అని నిలదీస్తున్నారు. ట్రంప్ తాజా ప్రకటన అమెరికన్లనే కాదు.. మిగతా దేశాలను ముక్కున వేలేసుకునేలా చేసింది.
× RELATED కరోనా నుంచి కోలుకున్న దంపతుల కథ ఇది..
×