లాక్ డౌన్: హోంశాఖ కొత్త మార్గదర్శకాలు.. వీటికే మినహాయింపు

కరోనా వైరస్ విస్తరించకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14వరకు సర్వం దేశంలో బంద్. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని మోడీ పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజాగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్నింటికి సడలింపులు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బుధవారం విడుదల చేసిన కొన్ని నిబంధనలను ఈసారి సడలించారు. తాజాగా హోంశాఖ విడుదల చేసిన లాక్ డౌన్ నిబంధనలు ఇవే..

*దేశంలో పనిచేసేవి
- రక్షణ ఆర్మ్ డ్ ఫోర్స్ ట్రెజరీ పెట్రోలింయ సీఎన్జీ ఎల్పీజీ పీఎన్జీ విపత్తుల నిర్వహణ విద్యుత్ ఉత్పత్తి పోస్టు ఆఫీసులు పనిచేస్తాయి.
-ఆర్బీఐ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్ కాగ్ అధికారులు పెట్రోలియం ప్రాడక్ట్స్ ఫారెస్ట్ అధికారులు పనిచేస్తారు
-దేశవ్యాప్తంగా ఆస్పత్రులు మెడికల్ షాపులు మందులువైద్య పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీలు వైద్య పరికరాలు వస్తువులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ యూనిట్లుక్లినిక్స్ నర్సింగ్ హోమ్స్ అంబులెన్స్ ల సేవలు పనిచేస్తాయి.
-ఈ రంగంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నింటికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు
-బ్యాంకులు ఏటీఎంలు ఇన్స్ రెన్స్ ఆఫీసులు నడుస్తాయి
-పాలు నిత్యవసర సరుకులు కూరగాయలతోపాటు చేపలు మాంసం దుకాణాలు తెరిచే ఉంటాయి.
--టెలికమ్యూనిషన్లు ఇంటర్నెట్ సర్వీసులు బ్రాడ్ కాస్టింగ్ కేబుల్ సర్వీసులు ఐటీ సర్వీసులు కొనసాగుతాయి..
-పోలీస్ సివిల్ డిఫెన్స్ ఫైర్ కలెక్టర్ కార్యాలయాలు విద్యుత్ శానటరీ మున్సిపాలిటీలు నడుస్తాయి.

*దేశంలో మూసివేసేవి
-లాక్ డౌన్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు
-వస్తువుల ఉత్పత్తి ప్రొడక్షన్ యూనిట్లు క్లోజ్ చేశారు.  
-ప్రజారవాణా పూర్తిగా బంద్
-పరిశ్రమలన్నీ మూత
-విమానా రైలు రోడ్డు రవాణా నిలిచిపోవాలి.
× RELATED బీజేపీయే కరోనా దేశమంతా వ్యాపింప చేసింది
×