కరోనాకు కృతఙ్ఞతలు తెలిపిన 'డర్టీ' భామ

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వైరస్ గురించి హడలిపోతుంది. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో  ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఎవరూ బయటికి వెళ్లొద్దని ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కొంతమంది సినిమా సెలెబ్రెటీలు తాము కూడా ఉన్నట్టుగా గుర్తించమన్నట్టుగా  సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఉంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొందరు కావాలని నెటిజన్లను ఏదో విధంగా కెళుక్కొంటున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే కొంతమంది నిలిచి తీవ్రమైన ట్రోల్ ను ఎదుర్కొన్నారు. ఈ పరంపరలో విద్యాబాలన్ కూడా జాయిన్ అయ్యింది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ మాత్రం కరోనా చాలా మంచి పనిచేసిందని ప్రశంసింది. అందుకు కారణమేమిటో విద్యా బాలన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఆ వీడియాలో ఏముందంటే..‘‘నిత్యం బిజీగా వాహన కాలుష్యంతో నిండివున్న రద్దీని తగ్గించింది. చెట్లు ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని కదిలించినందుకు మేం చాలా పెద్దదానిపై ఆధారపడి ఉన్నామని తెలిపినందుకు ధన్యవాదాలు. ఎంతో విలాసంగా జీవించే మాకు ఉత్పత్తులు స్వేచ్ఛ లాంటి వాటి నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నాం. మనకు ఇష్టమైన ఎన్నో ప్రాధమిక అవసరాలను పక్కన పెట్టి బిజినెస్ అంటూ తిరగడం. నీవల్ల అవన్నీ తెలిసి వచ్చాయి. మేం ఏం కోల్పోయాం అనే విషయాన్ని కరోనా వైరస్ వల్లే తెలిసింది. గతంలో ప్రపంచ పర్యావరణానికి ఎంతో హాని చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రపంచమంతా నీవల్ల ఇప్పుడు కలుస్తుంది. నీవల్ల మాలో ఐక్యత పెరిగింది. ప్రపంచ ఇప్పుడు మారి పోతుంది. ఎప్పుడూ ఓకేలా ఉండదు అని నిరూపించావు అంటూ’’ కరోనాకు ధన్యవాదాలు తెలిపింది.

దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సెలెబ్రెటీలు మరో పదేళ్ల పాటు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయినా బతికేయగలరు. కానీ మన దేశంలో ఏ రోజుకు ఆ రోజు సంపాదనతో బతుకీడ్చేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. మొత్తం లాక్ డౌన్ అయిపోయిన నేపథ్యంలో ఎంతో మంది సంపాదన లేక ఇక్కట్ల పాలవుతూ ఉంటారు. వారికి దుమ్మూధూళీ కాలుష్యాలు పట్టవు. ఎందుకంటే.. అన్నం ముఖ్యం కాబట్టి.  విద్యాబాలన్ లాంటి వాళ్లు ఇలాంటి పనికమాలిన వేదాంతాలు ఎన్నైనా చెప్పగలరు అంటూ నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. కాగా విద్యాబాలన్ ప్రస్తుతం అను మేనన్ దర్శకత్వంలో గణితమేధావి అయిన శకుంతలా దేవి జీవితాధారంగా వస్తున్న తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుంది.
× RELATED ఆ హీరో పాన్ ఇండియా ప్లాన్ ఏ ధైర్యంతో చేస్తున్నాడో..!
×