టాప్ యాంగిల్ లో ఇస్మార్ట్ థై షోస్

`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో భారీ హిట్ అందుకున్నా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ కెరీర్ నత్తనడకనే సాగుతోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. అదీ సూపర్ స్టార్  మహేష్  మేనల్లుడు అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం. ఆ సినిమా కూడా ఆగిపోయిందన్న ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే నిధి అగర్వాల్ టాలీవుడ్ లో ఖాళీ అయిపోయినట్లే. సరైన సక్సెస్ ఉన్నా! అవకాశాలు అందుకోవడంలో అమ్మడు ఎందుకనో  వెనుకబడే ఉంది.

నిధి కంటే లేట్ గా వచ్చిన భామలంతా అవశాలందుకుంటూ కెరీర్ ని  పరుగులు పెట్టిస్తున్నారు. తనకంటే సీనియర్ బ్యూటీలు స్పీడ్ మీదున్నారు. కానీ నిధి పరిస్థితే వేరుగా ఉంది. అయితే తమిళ్.. కన్నడలో మాత్రం ఒక్కో చిత్రం చేస్తోంది. అసలు నిధి టాలీవుడ్ లో వెనుకడటానికి కారణమేమిటి? అంటే.. ఇతర పరిశ్రమలతో పోలిస్తే.. ఇక్కడ పట్టు విడుపు లేకపోవడమేనన్న కామెంట్ ఉంది. పూరి చొరవతో ఇస్మార్ట్ శంకర్ లో హద్దులు కాస్త దాటినా మరీ ఓవర్ ఎక్స్ ఫోజింగ్ అయితే చేయలేదు. అలా మడి కట్టుకుని కూర్చోవడం వల్లనే నిధి ఇక్కడ వెనుకబడిందని ఓ విమర్శ తొలి నుంచి వినిపిస్తూనే ఉంది.

తాజాగా వాటన్నింటిని చెరిపేయాలనుకుందో! ఏమో.. ఇలా ఒక్కసారిగా ఓపెన్ అయింది. నిధి కొత్త ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. థై అందాలు ఎలివేట్ చేస్తూ జీన్స్ నిక్కరు ధరించి టాప్ లో టీషర్ట్ వేసింది. ఆ ఫోటోలో నేలపై వయ్యారంగా కూర్చొని  సీరియస్ గా ఏదో పెయింటింగ్ వేస్తూ ఇలా కనిపించింది. అయితే ఈ ఫోటోలో మరీ అంత బోల్డ్ గా కనిపించకుండా థై అందాలతో మురిపించింది. టాప్ యాంగిల్ లో ఆ సొగసు ఆకట్టుకుటుంది. అప్పుడప్పుడు అయినా ఇలాంటి ప్రయత్నం టాలీవుడ్ లో అవకాశాలు పెంచుతుందా?..  ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి.
× RELATED నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థత
×