సూపర్ స్టార్ తో జత కట్టనున్న మహానటి..?

సూపర్స్టార్ మహేశ్బాబు తెలుగు చిత్రసీమలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్బాస్టర్ హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకున్నాడు. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది పుకారుగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాకి గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా రేపో మాపో అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందంట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవాలని భావిస్తున్నాదంట. మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ అయితే బాగుంటుందని పరుశురామ్ కి సజెస్ట్ చేసాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ ఇద్దరి జోడీ అభిమానులకు కనువిందు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ న్యూస్ అధికారికంగా చెప్పకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుమీదున్న ఈ వార్త నిజమవుద్దేమో చూడాలి. కాగా కరోనా ఎఫెక్ట్ వల్ల ఆలస్యం అవుతున్న ఈ చిత్ర షూటింగ్ పరిస్థితులు అనుకూలిస్తే జూన్ లేదా జులై నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
× RELATED కరోనా వచ్చి ఆ హీరోకి కెరీర్ లేకుండా చేసిందా..?
×