లాక్ డౌన్ కు భారత జాతి చెల్లించే మూల్యం అంత మొత్తమట

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోడీ టీవీ స్క్రీన్ల మీదకు వచ్చి 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటనను చేయటం తెలిసిందే. అందరి అంచనాలకు భిన్నంగా ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన షాక్ తినేలా చేశారు. ఆయన నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అంశాల మీద మాట్లాడకంటే.. మౌనంగా ఉండటం మంచిది.

ఎందుకంటే.. యుద్ధం జరుగుతున్న వేళ.. యుద్ధానికి సంబంధించిన నిర్ణయం మీద చర్చలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కారణంగా భారత్ మీద పడే ఆర్థిక ప్రభావం ఎంత ఉంటుంది? మూడు వారాల లాక్ డౌన్ కారణంగా దేశం మీద పడే భారం.. చెల్లించే మూల్యం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్ క్లేస్. ఈ సంస్థ అంచనాల ప్రకారం లాక్ డౌన్ కారణంగా సుమారు రూ.9లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది భారత జీడీపీలో నాలుగు శాతానికి సమానం కావటం గమనార్హం. వాస్తవానికి మూడు వారాల పాటు లాక్ డౌన్ నష్టం ఇంత కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. దేశంలోని పలు రాష్ట్రాలు అంతకు ముందు నుంచే లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మొత్తం మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు.

తాజా లాక్ డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నారు. సుమారు 1.7 శాతం మేర తగ్గించి 3.5 శాతానికి పరిమితమవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే.. కరోనాపై భారత సర్కారు ముందే మేల్కొందన్న అభినందనలు పొందుతున్నాయి. అదే సమయంలో లాక్ డౌన్ కారణంగా దెబ్బతినే ఆర్థికవ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నాలు మాత్రం పెద్దగా మొదలు కాలేదన్న విమర్శ వినిపిస్తోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ.. ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం ఉందనుకుంటున్న వేళ.. కరోనా దెబ్బ మామూలుగా లేదంటున్నారు. మూలికే నక్క మీద తాటికాయ పడినట్లుగా ప్రస్తుత పరిస్థితిని అభివర్ణిస్తున్నారు.
× RELATED కరోనా నుంచి కోలుకున్న దంపతుల కథ ఇది..
×