కరోనాతో అమెరికాలో తొలి భారతీయుడి మృతి

అమెరికాలో  కరోనా కారణంగా ఓ  ప్రవాస భారతీయుడు  మరణించడం విషాదం నింపింది. ప్రముఖ చెఫ్ ఫుడ్ బిజినెస్ మ్యాన్ అయిన చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ తాజాగా కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితి విషమించి చనిపోయాడు.  న్యూయార్క్ లోని ఆస్పత్రిలో అతడు తుదిశ్వాస విడిచాడు. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో ఇతడిదే తొలి మరణం.

చెఫ్ ప్లాయిడ్ కార్డోజ్ ‘బొంబాయి క్యాంటీన్’ పేర్లతో చైన్ రెస్టారెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతడే సహ యజమాని.  ఓపెడ్రో బొంబాయ్ స్వీట్ పేర్లతో ఇతడికి షాపులున్నాయి. న్యూయార్క్ లో నివసిస్తుంటాడు. మార్చి మొదటి వారంలో ఇతడు భారతదేశంలోని ముంబైకి వచ్చాడు. ముంబైలో బిజినెస్ చూసుకొని తిరిగి న్యూయార్క్ వెళ్లాడు.

న్యూయార్క్ వెళ్లగానే జ్వరం దగ్గు ఊపిరి ఆడకపోవడం లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరాడు. ఇతడి మరణం భారత దేశంతో సంబంధాలు పెట్టుకున్న వారిలో భయాందోళనను సృష్టించింది.

చెఫ్ ప్లాయిడ్ కార్డోజ్ ముంబైకి వచ్చి వెళ్లాక మరణించడంతో అమెరికన్ అధికారులు ముంబైలోని ఆరోగ్యశాఖకు సమాచారం అందించారు. తద్వారా చెఫ్ ప్లాయిడ్ కలిసిన వారందరినీ గుర్తించి కరోనా పరీక్షలు చేయాలని సూచించారు.

కాగా ఫ్లాయిడ్ మరణంతో అతడితో ముంబైలో కలిసిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు వారందరూ కరోనా భయంతో హడలి చస్తున్నారు.
× RELATED కరోనా వైరస్ రాకుండా..ఈ భంగిమలే బెస్ట్!
×