ప్రేమమ్ బ్యూటీ గుస్సా.. దేనికో తెలుసా?

ముద్దు ముద్దు మాటలతో.. కొంటె చూపులతో .. గారంగా.. సుకుమారంగా.. వయ్యారంగా గుండెల్లో గిలిగింతలు పెట్టిన మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ ని తెలుగు యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. `ప్రేమమ్`లో క్యూట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఉన్నట్టుండి తెగ గుస్సా అవుతోంది. జనం బాధ్యతా రహిత్యంగా వ్యవహరించడంపై మండిపడుతోంది. మరి ఈ అందాల బొమ్మని అంతగా ఇరిటేట్ చేసిన ఘటన ఏంటో అని ఆమె అభిమానులు సైతం బాధపడుతున్నారు. మరి ఈ భామకి అంతగా కోపం రప్పించిన సంఘటన ఏది? అంటే.. వేరే చెప్పాలా? ఇది కరోనాతో ముడిపడినదే. కరోనా మహమ్మారీ రోజురోజుకి విస్తరిస్తున్నా.. జనం మాత్రం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని... మాస్క్ లు ధరించి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని అనుపమ తెగ ఫీలైంది.

దానికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ చాలా చెప్పింది. ``వాహ్.. ఈ ఫోటోలు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని మీకు అనిపించడం లేదా? 500మీటర్ల పరిధిలో కనిపించిన మాస్కులివి. నా డాక్టర్ ఫ్రెండ్ కి ఐసోలేషన్ వార్డుకి వెళ్లే దారిలో ఇవన్నీ కనిపించాయి. మనం కరోనాతో పోరాడుతున్న తీరు ఇదేనా? ఇలా చేయకండి. చెత్తకుండీలు ఎందుకు ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి మాస్కులు కనిపిస్తే దయజేసి తిరిగి వాడొద్దు... తాకొద్దు` అని ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అభిమానులు ఆమెకి మద్దతు పలుకుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.

`అ..ఆ`లో నెగటిషేడ్ ఉన్న పాత్రతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ`ప్రేమమ్`- `శతమానంభవతి` చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది.  ఆ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఉన్నది ఒకటే జిందగీ- కృష్ణార్జున యుద్ధం- తేజ్ ఐ లవ్ యూ- హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. గతేడాది నటించిన రీమేక్ మూవీ `రాక్షసుడు` మంచి విజయం సాధించింది. అయినా ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా.. కన్నడలో ఓ సినిమా చేస్తోంది.
× RELATED మనసు చాటుకున్న స్టార్ విలన్..
×