ఆ మూడింటితో రఫ్ఫాడిస్తా.. అంటున్న కాజల్

కాజల్ అగర్వాల్. ఈ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటి అందం అభినయం ఆమె సొంతం. కాజల్ అభిమానులపై గ్లామర్ వర్షం కురిపించడంలో ముందుంటుంది. మిలియన్ల సంఖ్యలో అభిమానులను కలిగిన కాజల్ కెరీర్ ముగిసింది అనుకున్న ప్రతిసారి తనని తాను నిరూపించుకుంటూనే ఉంది. ఈ సోయగాల కళ్ల సుందరి సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య'లో ఛాన్స్ కొట్టేసి సడన్ షాక్ ఇచ్చింది. అసలు కాజల్ ఎలా వచ్చిందబ్బా..!అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక డైరెక్టర్ శంకర్ అంటే ఇండియా మొత్తం తెలుసు. ఆయన ప్రస్తుతం కమల్ హాసన్ తో రూపొందిస్తున్న 'భారతీయుడు 2'లో కూడా అవకాశం దక్కించుకుంది. ఇక బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహం కొత్త సినిమాలో కూడా కాజల్ త్వరలో నటించనుంది. ప్రస్తుతం కాజల్ చేస్తున్న మూడు సినిమాలు పెద్దవే. అంటే తన కెరీర్ ఇంకా అయిపోలేదని చెప్పకనే చెబుతోంది బ్యూటీ క్వీన్ కాజల్.
× RELATED కరోనా వచ్చి ఆ హీరోకి కెరీర్ లేకుండా చేసిందా..?
×