డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అంటున్న మంజిమ

సాహసం శ్వాసగా సాగిపో.. సినిమా హీరోయిన్ గుర్తుందా..! మంజిమ మోహన్. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో తెలుగు కుర్రకారు మనసులు దోచుకెళ్లింది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ ఈ కేరళ బ్యూటీ తమిళంలో చాలా బిజీ హీరోయిన్. కరోనా కారణంగా షూటింగ్ ఆపేసి ఇంట్లో ఉంటున్న మంజిమ తక్కువ కాలంలోనే మిల్లియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక కరోనా తో బెంబేలెత్తిపోయి షూటింగ్స్ ఆపేయడంతో అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతుంది.

ఇటీవలే మంజిమ ట్విట్టర్ వేదికగా.. ఒక ట్వీట్ చేసింది. ఇప్పుడా ట్వీట్ నెట్టింట వైరల్ అయి హల్చల్ చేస్తుంది. ఇంతకీ మంజిమ చేసిన పోస్ట్ ఏంటంటే.. 'నాకింకా అర్థం కావట్లేదు. ఈ జనాలు ఇళ్లలో ఎందుకు ఉండలేక పోతున్నారో.. జస్ట్ స్టే ఎట్ హోమ్' అని ట్వీట్ చేసింది. దానికి ఒక పర్సన్ 'హే.. ఫ్యాట్సో.. తిండి నువ్వు పెడతావా..?' అని రిప్లై ఇచ్చాడు.

వెంటనే అమ్మడు ఆ రిప్లై కి బదులిస్తూ.. 'ఇదండీ.. పరిస్థితి. నేను మాములుగా ఎవరికీ రిప్లై ఇవ్వను. ఇదిగో ఇస్తే ఇలాగే ఉంటుందని. నేను ఖాళీ ఇంట్లో ఉండండి అన్నందుకు ఇలాంటి రిప్లైస్ వస్తున్నాయి. మీరు ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లో ఉండటం ఈజీ అనుకుంటే మాత్రం మీరు తప్పు బ్రదర్.. ఇక్కడ డబ్బులు ఎవరికీ ఆకాశంలో నుండి రాలి పడట్లే' అంటూ క్యూట్ గా బదులిచ్చి ఆపేసింది. ఇదండీ సంగతి.. ఫేవరెట్ హీరోయిన్స్ చెప్తేగాని వినం అంటారు తీరా చెప్తే ఇలా స్పందిస్తారు. అందుకే రిప్లై ఇవ్వబుద్ది కాదు అనుకుంటున్నారు హీరోయిన్లు అంతా..!
× RELATED 'అలా చెప్పేస్తే ఎలా సార్..' అని హర్ట్ అయిన డైరెక్టర్
×