ఫొటో టాక్ : బ్లాక్ అండ్ వైట్ లోనూ హీట్ పెంచేస్తోంది

గత పది సంవత్సరాలుగా బుల్లి తెరపై తనదైన శైలిలో అలరిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ సన మక్బుల్. ఈ అమ్మడు బుల్లి తెర నుండి వెండి తెరకు షిఫ్ట్ అయ్యింది. తెలుగులో ఈమె రెండు చిత్రాల్లో నటించింది. మొదటగా దిక్కులు చూడకు రామయ్య అంటూ ఒక సినిమాలో చేయగా అది కాస్త నిరాశ పర్చింది. ఆ తర్వాత తమిళంలో రంగూన్ అనే చిత్రంలో నటించింది. 2017 లో తెలుగులో మామ ఓ చందమామ అనే చిత్రంలో నటించి మళ్లీ వెండి తెరపై కనిపించలేదు.

వెండి తెరకు దూరంగా ఉన్నా కూడా ఈ అమ్మడు బుల్లి తెరకు మాత్రం ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు తరుచు కనిపిస్తూనే ఉంది. ఈ అమ్మడు చేసిన బుల్లి తెర షో లు ఇంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఈమె పోస్ట్ లు ఆమె ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ముఖ్యంగా ఈ అమ్మడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో కూడా ఇంత హాట్ గా ఉందేంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చక్కని అందంకు వెండి తెరపై ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం దారుణం అంటూ కొందరు ఆమె సినీ కెరీర్ విషయంలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.


× RELATED ఫోటో స్టోరీ: ఇది బికినీ సారామృతం
×