ఈ దేశాల్లో ఆయుర్ధారం ఎక్కువ.. ఎందుకో తెలుసా?

ప్రతీఒక్కరికి నిత్యయవ్వనంతో ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది. కానీ మారుతున్న పరిస్థితుల్లో రోజురోజుకు మానవుడి సగటు ఆయుర్దాయం తగ్గుతూ పోతుంది. శాస్త్రవేత్తలు మానవుడి ఆయుర్ధాన్ని పెంచేందుకు ఎన్నోరకాల పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో సగటు ఆయుర్ధాయం మాత్రం తగ్గుందన్నది వాస్తవం. కాగా కొన్ని దేశాల్లో మాత్రం సగటు ఆయుర్ధాయం 80కిపై మాటే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ దేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*ప్రపంచంలోనే దక్షిణ కొరియా టాప్

ముందుగా దక్షిణ కొరియానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడు సగటు ఆయుర్ధాయం 90పైమాటే. ప్రపంచంలో 90ఏళ్లు సగటు ఉన్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సృష్టించింది. ఈ దేశం బలమైన ఆర్థిక  వ్యవస్థను కలిగి ఆదర్శంగా నిలుస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలకు తక్కువ రక్త పోటు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఉన్నాయి. కొరియన్లు ఎక్కువగా పులియబెట్టిన ఆహారాన్ని డైట్ గా తీసుకుంటారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి క్యాన్సర్ ను నివారిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీరు బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. దీనివల్ల వీరు ఒత్తిడి - ఆందోళన దూరంగా ఉంటారు.

*2వ దేశం సింగపూర్

సింగపూర్ పర్యాటక దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రజల జీవన ఆయుర్ధాయం 83.1. ఎక్కువ కాలం జీవించే ప్రజల జాబితా దేశాల్లో రెండవ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. వీరికి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. ఉదయాన్నే పార్క్ ల్లో - జిమ్ లలో వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉంటారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. ఇటీవల సింగపూర్ తన తొలి థెరపెటిక్ గార్డెన్ పబ్లిక్ పార్క్  ప్రారంభించింది. ఇది ఒత్తిడి తగ్గించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

*జపాన్

జపానీయులు ఎక్కువ కాలం జీవిస్తారనే చాలా మందికి తెలుసు. వీరి సగటు ఆయుర్ధాయం 83సంవత్సరాలు. జపాన్ ను అమర వీరుల భూమిగా పిలుస్తారు. జపాన్ ప్రజలు అత్యున్నత నాణ్యమైన జీవనాన్ని కలిగి ఉంటారు. వీరు తీపి బంగాళదుంపలు చేపలు రిచ్ డైట్ తీసుకుంటారు. జపాన్లో ప్రాచీనం నాటి సంస్కృతులు పాటిస్తూ ప్రాచీన ఆహారాన్ని తీసుకుంటుండడం వారి ఆయుర్ధాయం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

* స్పెయిన్

స్పెయిన్ లో సగటు ఆయుర్ధాయం 82.8 సంవత్సరాలు. స్పెయిన్ కూడా జపాన్ మాదిరిగానే ఉంటుంది. స్పానిష్ ప్రజల అధిక ఆయుర్ధాయానికి కారణం వారి మెడిటేరియన్ డైట్. ఆలివ్ ఆయిల్ - కూరగాయలు - వైన్ వంటివి గుండెకు మేలు చేకూరుస్తాయి. అరగంట భోజన విరామానికి బదులుగా 2నుంచి 3గంటల విరామం తీసుకుంటారు. వీరంతా వాహనాలను వినియోగించడం కంటే నడకకే ప్రాధాన్యమిస్తారు.

*స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్ లో ప్రజల సగటు ఆయుర్ధాయం 81 సంవత్సరాలు. స్విట్జర్లాండ్ ఐరోపాలోని సంపన్న దేశాలలో ఒకటి. ఆరోగ్య సంరక్షణ - బలమైన వ్యక్తిగత భద్రత - ప్రజా శ్రేయస్సు వంటివి ప్రజలు ఎక్కువ కాలం జీవించేందుకు దోహదపడుతున్నాయి. చీజ్ మరియు డైరీ ఉత్పత్తులను తీసుకుంటారు. స్విట్జర్లాండ్ వృత్తి ఆధారిత దేశం. ఇక్కడి ప్రజలు వీకెండ్స్ లో ప్రయాణాలను ఎంజాయ్ చేస్తూ గడుపుతుంటారు.
 
× RELATED కరోనా ఎఫెక్ట్..మాంద్యంతో పాటు ఆహార సంక్షోభం కూడా!
×