ఘోర రోడ్డు ప్రమాదం .. 20 మంది దుర్మరణం !

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. చాలా వరకు ప్రమాదాలకి మితిమీరిన వేగమే కారణం అని చెప్పాలి. ఒక్కోసారి మనం ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ కూడా ఎదురుగా వచ్చేవారివల్ల మనకి ప్రమాదం ఏర్పడవచ్చు. తాజాగా చెన్నై లో అలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. ఆ ప్రమాదం లో 20 మంది ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. నిర్గాంత పోయే ఈ సంఘటన ..కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద జరిగింది.

కేరళ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు ...బుధవారం రాత్రి బెంగళూరులోొని శాటిలైట్ బస్ స్టేషన్ నుంచి కేరళ లోని ఎర్నాకుళానికి 48 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయానికి ఎర్నాకుళానికి చేరుకోవాల్సి ఉంది. మరికాసేపట్లో గమ్యస్థానికి చేరుకుంటుంది అనగా అవినాశి వద్ద బస్సును ఓ కంటైనర్ అతి వేగంగా వచ్చింది ఢీ కొట్టింది. కంటైనర్ చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టడం తో ..ఆ వేగానికి బస్సు కుడి వైపు భాగం మొత్త తుక్కుతుక్కు అయి పోయింది దీనితో ఆ వరుసలో కూర్చున్న ప్రయాణికుల్లో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. బస్సు కుడివైపు భాగం మొత్తం ..చీల్చుకు పోయింది. అలాగే కంటైనర్ ఢీ కొట్టిన వేగానికి బస్సు తలుపులు బిగుసుకునిపోయాయి.

దీనితో బస్సులో నుండి బయటకి రావాలన్న కూడా లోపల ప్రాణాలతో మిగిలిన ప్రయాణికులు రెండుగంటల పాటు కష్టపడ్డారు. ఇక ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అధికారులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు. గాయపడ్డ వారిని కోయంబత్తూరు తిరుప్పూర్ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తమిళనాడు లో చోటు చేసుకున్న భయంకరమైన ఘోర రోడ్డు ప్రమాదం గా దీన్ని భావిస్తున్నారు. ఆర్టీసీ రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఏకంగా 20 మంది దుర్మరణం పాలు కావడం కేరళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీనిపై స్పందించిన కేరళ రవాణా శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ ..రళ ఆర్టీసీ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ను సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాలని ఆదేశించారు. అలాగే గాయపడ్డ వారందరికీ మంచి వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.
× RELATED 20 లక్షలకు బీజేపీలో నామినేటెడ్ పందేరం..
×