ఉరి తప్పించుకోవడానికి నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం

ఏడేళ్ల కిందట ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన నిర్భయ నిందితుల ఉరికోసం దేశమంతా ఎదురుచూస్తోంది. నిర్భయ తల్లి అయితే ఎక్కని కోర్టు లేదు.. బాధపడని రోజు లేదు.. ఇంత మంది ఎదురుచూస్తున్నా నిర్భయ దోషుల ఎత్తుగడలతో వారి ఉరి ఆలస్యం అవుతూనే ఉంది. కోర్టుల్లో వరుసగా పిటీషన్లు వేస్తూ లూప్ హోల్స్ వెతుకుతూ తమ ఉరిని ఆలస్యం చేసుకుంటున్నారు.

తాజాగా నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. నలుగురు దోషులను మార్చి 3న ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరితీస్తారు.

ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తన సెల్ లోనే గోడకు తల బాదుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. గమనించిన సిబ్బంది అతడిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా ఉరిశిక్ష నుంచితప్పించుకోవడానికి దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ మరణశిక్ష నుంచి బయటపడడానికే ఈ మార్గాన్ని దోషి వినయ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నంతోనైనా తన ఉరి ఆగుతుందని వినయ్ శర్మ ఈ పన్నాగం పన్నినట్టు సమాచారం.

గతంలోనూ వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశారు. రెండురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు జైలు వర్గాలు తెలిసపాయి. అయితే ఉరి కారణంగా వినయ్ మానసికంగా సతమతమవుతున్నాడని.. డిప్రెషన్ తో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది.
× RELATED సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశా.. బంతి గాల్లో ఉందన్నాడు
×