వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో దాడి

అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి టీడీపీ ఇతర పార్టీల నుంచి దిగ్గజ నేతల చేరికను క్షేత్రస్థాయిలోని వైసీపీ సానుభూతిపరులు కార్యకర్తలు తట్టుకోవడం లేదు.

తాజాగా వైసీపీలో చేరేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంత్రి మోపిదేవితో పాటు కలిసి ద్రాక్షారామం వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత తోట త్రిముర్తులుకు చేదు అనుభవం ఎదురైంది. వైవీ సుబ్బారెడ్డి ముందే తోట త్రిముర్తులును ఇజ్రాయెల్ అనే వైసీపీ నేత చెప్పుతో దాడి చేయడం కలకలం రేపింది. పోలీసులు కార్యకర్తలు ఇజ్రాయెల్ ను పక్కకు తోసేయడం తో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అసలు ఎవరీ ఇజ్రాయెల్ అని ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. ఇజ్రాయెల్ ది తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం మసకపల్లి. ఇతడు స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన నేత.. తోట త్రిముర్తులు వైసీపీలో చేరితే వైసీపీ ఎమ్మెల్యే వేణు భవిష్యత్తుకు ఇబ్బంది. సో తోట త్రిమూర్తులను వైసీపీలో చేర్చుకోవడానికి చూస్తున్న వైవీ సుబ్బారెడ్డి మంత్రి మోపిదేవి ముందే అతడిపై చెప్పులతో దాడి చేశాడు.

ఈ విషయాన్ని ఆ తర్వాత ఇజ్రాయెల్ సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఆ పోస్టులు వైరల్ గా మారాయి. తోటనుతానే చెప్పుతో కొట్టానని.. అతడికి వ్యతిరేకం గా దళిత సంఘాల మద్దతు కోరుతున్నానని ఇజ్రాయెల్ పేర్కొన్నాడు.
× RELATED అల రీమేక్ రైట్స్ వివాదం రాజుకుంటుందా?
×