బిచ్చమెత్తి ఏకంగా గుడికే విరాళమిచ్చాడు.. ఎంతో తెలుసా?

రూపుకే బిచ్చగాడు.. కానీ దానదయాగుణంలో ఇతడు అందరికంటే కోటీశ్వరుడని నిరూపించాడు. రోజూ అడుక్కునే ఈ బిచ్చగాడు తన దయాగుణంతో కోటీశ్వరుడిగా నిలిచాడు. వందలు వేల కోట్లు ఉన్నా కనీసం పైసా విదిల్చని వారికి చెంపపెట్టులా ఇతడి చర్య ప్రశంసలు అందుకుంది. అడుక్కోవడం ద్వారా వచ్చిన సొమ్మును గుడికి దానం చేసి నిస్వార్థ హృదయాన్ని చాటాడు..

ఆలయాల ముందు భిక్షాటన చేస్తూ జీవిస్తుంటాడు యాదిరెడ్డి. ఈయనది నల్గొండ జిల్లా.. 75 ఏళ్ల వయసు.. విజయవాడలోని ఆలయాల వద్ద అడక్కుకుంటాడు. ఒకప్పుడు రిక్షా లాగుతూ జీవించిన యాదిరెడ్డి కాళ్ల మోకాలి చిప్పలు అరిగిపోవడంతో ఆలయాల వద్ద భిక్షాటన చేస్తున్నాడు. ప్రస్తుతం విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయం వద్ద చాలా రోజులుగా భిచ్చమెత్తుతున్నాడు. ఇలా యాచన ద్వారా ఏకంగా 8 లక్షల రూపాయలు సేకరించాడు. తాజాగా బిచ్చమెత్తుకుంటే వచ్చిన సొమ్మును మళ్లీ గుడులకే దానం చేసి వార్తల్లో నిలిచాడు.

తాను ఎప్పుడూ అడుక్కుంటుండే సాయిబాబా ఆలయానికి ఏకంగా 8 లక్షల రూపాయల దానం వేసి యాదిరెడ్డి అందరినీ ఆశ్చర్య పరిచాడు. తన ఆరోగ్యం దెబ్బతిన్నదని.. అందుకే తాను సేకరించిన డబ్బును ఆలయాలకు విరాళంగా ఇస్తున్నానని యాదిరెడ్డి తెలిపారు. ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరిన్ని ఆలయాలకు తాను డబ్బులు విరాళంగా ఇచ్చానని తెలిపాడు.

ఈ బిచ్చగాడి ఉదారత్వం వైరల్ గా మారింది. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇతడి గొప్పతనంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
× RELATED భార్యకు బోలెడన్ని ఆఫైర్లు అని..చేయకూడని పని చేసేశాడు