పర్సనల్ విషయాల మీద పెదవి విప్పిన శ్రియ

చాలామంది హీరోయిన్లకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంటుంది శ్రియ. అగ్రహీరోలతో ఆడి పాడినా.. ఎంతవరకో అంత వరకన్నట్లుగా ఉంటుందామె వ్యవహారం. సుదీర్ఘకాలం హీరోయిన్ గా చెలామణీ కావటమే కాదు.. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ సైతం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ప్రేమించి పెళ్లాడిన టెన్నిస్ ప్లేయర్ గురించి శ్రియ పెద్దగా చెప్పింది లేదు. ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు. ఎందుకంటే.. పర్సనల్ విషయాల్ని పంచుకోవటం తనకు పెద్దగా ఇష్టముండదన్నది ఆమె మాట.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంగ్లిషు మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రియ. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల్ని రివీల్ చేసింది. ముఖ్యంగా తన లవ్ ట్రాక్. ఆండ్రీకి తానెలా ఫిదా అయ్యిందన్న వివరాల్ని వెల్లడించారు. తామిద్దరం తొలిసారి మాల్దీవ్ స్ లో కలిశామని.. అప్పటికి తానో నటినన్న విషయం అతనికి తెలీదని చెప్పింది.

తాను నటిని అన్న విషయం తెలిసిన తర్వాత ఆన్ లైన్ లో తాను నటించిన సినిమాల్ని చూసినట్లుగా చెప్పింది. తాను నటించిన అర్జున్ సినిమాలో ఒక పాటను సెయింట్ పీటర్స్ బర్గ్ లో షూట్ చేశారు. ఆ విషయాన్ని తాను మర్చిపోయానని.. ఆండ్రీ మాత్రం తనను అక్కడకు తీసుకెళ్లి.. ఇక్కడే నువ్వో పాటలో నటించావు.. డ్యాన్స్ చేశావంటూ అప్పటి విషయాల్ని గుర్తు చేశాడని చెప్పింది. ఆ విషయం తనకు చాలా బాగా నచ్చినట్లు చెప్పింది.

తన జీవితంలో జరిగిన మంచి విషయాల్లో ఆండ్రితో పెళ్లి జరగటం ఒకటని చెప్పింది శ్రియ. అతని మాదిరి సపోర్ట్ చేసే భర్త లభించటం నిజంగా లక్కీ అంటున్న శ్రియ.. గత ఏడాది చేసుకున్న వేలంటైన్స్ డే ది బెస్ట్ అని చెప్పుకొచ్చింది. ఆ రోజున.. ది నట్ క్రాకర్ అనే షోకు ఆండ్రీ తనను తీసుకెళ్లినట్లు చెప్పింది. కోరి మరీ చేసుకున్న భర్త తో తానెంత హ్యాపీ గా ఉన్నానన్న విషయాన్ని శ్రియ చెప్పుకొచ్చారు.
× RELATED మా వ్యక్తిగత విషయాలపై మీ రచ్చ ఎందుకు?
×