సామ్ కు ఆమె నచ్చలేదా?

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. తనను పోలిన మనిషి మరొకరు ఉన్నారంటే.. ఆ వ్యక్తి ఏ స్థానంలో ఉన్నా ఎగ్జైట్ అవుతారు. అందుకు భిన్నంగా సమంత తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరైన ఆమెను పోలినట్లుగా ఉంటారంటూ కొందరిని చూపించినా ఎవరూ కూడా తమిళ్ హీరోయిన్ ఆత్మిక సాటి రారనే చెప్పాలి.

సామ్ కు స్టాంప్ మాదిరి ఈ తమిళ నటి ఉండటం.. ఆమె తాజా ఫోటో షూట్ అదే విషయాన్ని చెప్పేస్తున్నాయి. ఎంత పరీక్ష గా చూసినా.. ఆమెకు.. సమంతకు మధ్య తేడా కనిపించని పరిస్థితి. మరీ తీక్షణంగా చూస్తే.. ఇద్దరి చేతులు కాస్త తేడాగా ఉన్నాయే తప్పించి..ముఖంలో ఎలాంటి తేడా లేని పరిస్థితి. ఇప్పటికే మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ చిన్న సమంత గురించిన ఫోటోలు.. వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

తనను పోలినట్లుగా ఉండటమే కాదు.. తన మాదిరే ఉన్న ఆత్మిక గురించి సామ్ ఇప్పటివరకూ స్పందించకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే.. సామ్ తనను పోలిన అమ్మాయి మీద గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. తనరియాక్షన్ ఇప్పటివరకూ రాకపోవటం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. అందరి మాదిరి తనను పోలినట్లుగా మరొకరు ఉండటాన్ని సమంత ఇష్టపడటం లేదా?


× RELATED జాను దెబ్బకు సామ్ అంతగా షేకైందా?
×