ఆగిపోయిన సినిమా మళ్ళీ సెట్స్ పైకి

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఓపినింగ్ కి ముందే క్యాన్సెల్ అవ్వడం మరికొన్ని సెట్స్ పైకి వవెళ్ళాక ఆగిపోవడం కామనే. ఈ లిస్టులో  చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో నాగ శౌర్య సినిమా కూడా ఒకటి. అవును రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ శౌర్య చేసిన సినిమా.. ఆ మధ్య కుకట్ పల్లీ టెంపుల్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. వెంటనే షూటింగ్ కూడా మొదలైంది. కానీ అనుకోకుండా సినిమా ఆగిపోయింది.

నిర్మాతకు - హీరోకి జరిగిన ఓ చిన్న డిస్కర్షన్ వల్ల సినిమా టాకీ పూర్తికాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత హీరో మరో సినిమా చేసుకుంటే నిర్మాత కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై శ్రద్ధ పెట్టి బిజీ అయ్యాడు. ఇక అందరూ ఆగిపోయిందనుకున్న ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కబోతుంది. అవును మళ్ళీ అదే కథతో రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శౌర్య.

ఈ కాంబినేషన్ సినిమాను మహేష్ కోనేరు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే గతంలో ఈ సినిమా ఎందుకు ఆగింది ? అసలు నిర్మాత కు హీరోకి మధ్య ఎలాంటి డిస్కర్షన్ జరిగిందనేది మాత్రం మిస్టరీ గానే ఉంది. ఏదేమైనా తనను నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ డెబ్యూ డైరెక్టర్ కి మళ్ళీ చాన్స్ ఇచ్చి నిర్మాతను సెట్ చేసి సినిమా చేస్తున్నాడు శౌర్య. ఇది మేచుకోవాల్సిన విషయమే.
  


× RELATED త్రివిక్రమ్ సినిమాకి ఎన్టీఆర్ పారితోషకం ఎంతో తెలుసా? NTR Remuneration in Next Movie with Trivikram
×