దేవరకొండపై డాక్టర్లు ఆగ్రహం..అసలేమన్నాడంటే

విజయ్ దేవరకొండ నేడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం చివరి వారం రోజులు విజయ్ దేవరకొండ తెగ హడావుడి చేశాడు. ప్రీ రిలీజ్ వేడుకలు.. మీడియాతో ఇంట్రాక్షన్స్.. ఇంటర్వ్యూలు ఇలా రకరకాలుగా సినిమాకు పబ్లిసిటీ చేయడం జరిగింది. ఆ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో రాశిఖన్నాతో కలిసి ఈ రౌడీ స్టార్ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా రాశిఖన్నా తాను డాక్టర్ తో డేటింగ్ చేయాలని అనుకుంటున్నాను అంటూ చెప్పింది.

రాశిఖన్నా వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ కాస్త ఫన్నీగా స్పందిస్తూ.. డాక్టర్లతో డేటింగ్ అంటే వేరేలా ఉంటుంది. వారు బాడీని.. బుగ్గలను.. చెస్ట్ ను సైటిఫిక్ నేమ్స్ తో పిలుస్తారు అంటూ వారిలో రొమాంటిక్ యాంగిల్ ఉండదు అనే ఉద్దేశ్యంతో రాశి ఖన్నాను ఆట పట్టించాడు. డాక్టర్ల గురించి విజయ్ దేవరకొండ మాట్లాడటం పూర్తిగా సరదాగానే. రాశిఖన్నా డాక్టర్లతో డేటింగ్ అన్న సమయంలో ఆమెను ఆట పట్టించేందుకు అలా అన్నాడు.

ఇప్పుడు డాక్టర్లు ఆ మాటకు ఫీల్ అవుతున్నారట. డాక్టర్లలో రొమాంటిక్ యాంగిల్ ఉండదని విజయ్ దేవరకొండ మాట్లాడటం తమను అగౌరవ పర్చడమే అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో లేడీస్ గురించి కూడా విజయ్ దేవరకొండ తప్పుగా మాట్లాడాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు మాత్రం విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ విషయమై రౌడీ స్టార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
× RELATED ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దేవరకొండ హీరో!
×