అక్కినేని హీరో...పర్ ఫెక్ట్ ప్లానింగ్ !

ఏ హీరో అయినా కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే బోల్తా కొట్టక తప్పదు. చేయబోయే దర్శకుడు గతంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా సత్తా చాటాయి..? ఆ డైరెక్టర్ కెరీర్ గ్రాఫ్ ఇలా అన్నీ చూసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు సరిగ్గా అదే ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు చైతూ. అవును అక్కినేని హీరో కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తో సినిమా చేస్తున్నాడు చైతూ. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడంతో 'లవ్ స్టోరి' అంచనాలున్నాయి. ఈ సినిమా ఫిదా రేంజ్ లో కాకపోయినా సేఫ్ జోన్ ప్రాజెక్ట్. అందుకే ఈ సినిమాను ఒకే చేసాడు చైతూ.

ఇక శేఖర్ కమ్ముల తర్వాత తన 20 సినిమాకు కూడా ఇదే ప్లానింగ్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో ప్లాన్ చేసుకున్నాడు. గీత గోవిందంతో సెన్సేషనల్ హిట్ సాదించిన పరశురాం బుజ్జి చేతిలో తన ఇరవై సినిమా పెట్టాడు. ఈ సినిమా చైతూ ల్యాండ్ మార్క్. ఇక్కడ నుండి మరో ఎత్తుకు వెళ్ళాలని భావిస్తున్నాడు. అందుకే బుజ్జి తో జత కట్టాడు.

పరశురాం సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అయితే ఖాయం ఒక వేళ టైం సరిగ్గా కుదిరితే ఏ రేంజ్ హిట్ అవుతుందో చెప్పలేం. సో అందుకే సేఫ్ జోన్ డైరెక్టర్ తో సినిమాలు చేస్తూ బ్యాక్ టూ బ్యాక్ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తున్నాడు అక్కినేని హీరో. మరి చైతూ వీటితో ఎలాంటి హిట్స్ సాదిస్తాడో తనది పర్ఫెక్ట్ ప్లానింగ్ అని రుజువు చేసుకుంటాడో లేదో చూడాలి.
× RELATED బన్నీ ప్లానింగే వేరబ్బా..
×