సుప్రీం సీరియస్ తో 500 పాయింట్లు ఫట్

తుమ్మితే ముక్కు ఊడిపోయేలా ఉంటుంది స్టాక్ మార్కెట్ సెంటిమెంట్. ఎప్పుడు..ఏ అంశానికి ప్రభావితం అవుతుందో ఒక పట్టాన అర్థం కానట్లు ఉండే సెన్సెక్స్.. ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టు చేసిన సీరియస్ వ్యాఖ్యలకు తీవ్ర ప్రభావానికి లోనైంది. అప్పటివరకూ లాభాల్లో ఉన్న మార్కెట్ సీన్ ఒక్కసారిగా మారింది. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైంది.

చివరకు లాభాల నుంచి నష్టాల్లోకి జారింది. దీంతో పలు కంపెనీల షేర్లు ప్రభావానికి గురయ్యాయి. టెలికం కంపెనీలు ఏజీఆర్ చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో పాటు..సీరియస్ కావటం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీసింది. దీనికి తోడు.. రూ.92వేల కోట్లు ఉన్న టెలికం సంస్థల బకాయిల్ని తాము ఆదేశించినట్లుగా ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించటం పలు కంపెనీల షేర్ల మీద ప్రభావాన్ని చూపించింది.

ఈ పరిణామంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠం నుంచి ఏకంగా 519 పాయింట్లు.. నిఫ్టీ ఇంట్రాడే హై నుంచి 148 పాయింట్లను కోల్పోయింది. మొత్తంగా ఈ రోజు 190 పాయింట్లు కోల్పోతే.. నిఫ్టీ 60 పాయింట్ల వరకూ నష్టపోయింది. వారాంతంలో చోటు చేసుకున్న అమ్మకాల ఒత్తిడి సోమవారం ప్రారంభమయ్యే మార్కెట్ మీద పడుతుందని చెబుతున్నారు.

సుప్రీం వ్యాఖ్యలు నేపథ్యంలో బ్యాంకులు.. టెలికాం సెక్టార్ కు చెందిన పలు కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తున్నాయి. మిగిలిన టెలికం కంపెనీలతో పోలిస్తే.. భారతి ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతోంది. అదే సమయంలో కోర్టు తీర్పు అమలైన పక్షంలో తీవ్ర ప్రభావానికి గురయ్య వోడాఫోన్ షేరు భారీగా కుదేలైంది. టెలికం కంపెనీల ప్రభావం ఇలా ఉంటే..పలు బ్యాంకు షేర్లు లాభాల బాట పట్టాయి.


× RELATED టెలికం కంపెనీల పై సుప్రీం మహా సీరియస్.. ఘాటు వ్యాఖ్యలు
×