నా ఆత్మ గౌరవానికి విలువివ్వండి..పవన్ గిఫ్ట్ పై రేణు స్పందన

రేణు దేశాయ్ ప్రతి కదలికపై మీడియా దృష్టి ఉంటుంది. ఆమె ఏం చేసినా కూడా పవన్ కు రిలేటెడ్ గా ఏదో ఒక పుకారు పుట్టిస్తూనే ఉంటారు. ఆ విషయమై ఆమె చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఆమె ఏం చేసినా కూడా పవన్ అభిమానులను దృష్టిని ఆకర్షించేందుకు అంటూ విమర్శలు చేయడం.. పవన్ నుండి విడిపోయిన తర్వాత ఆయన ఇమేజ్ ను వాడుకునేందుకు రేణు దేశాయ్ ప్రయత్నిస్తుందని కూడా ఎన్నో సార్లు ఆమెను టార్గెట్ చేశారు. ఇక విడాకుల సమయంలో ఆమె భారీగా భరణం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఇక తాజాగా హైదరాబాద్ లో రేణు ఒక ప్లాట్ కొనుగోలు చేయగా దాన్ని కూడా వక్రీకరించి పుకార్లు పట్టించడంతో రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యింది.

రేణు దేశాయ్ కి హైదరాబాద్ లో పవన్ అయిదు కోట్లు పెట్టి ప్లాట్ కొనిచ్చాడంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె చాలా సీరియస్ గా స్పందించింది. ఆ ప్లాట్ తన కష్టార్జితంతో కొనుగోలు చేశాను అని పవన్ చేశాడని తన ఆత్మ గౌరవాన్ని అవమానపర్చవద్దంటూ విజ్ఞప్తి చేసింది.

ఇంకా రేణు దేశాయ్... నిన్నటి నుండి నాకు కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నా నిజమైన ఆస్తి నా ఆత్మగౌరవం నా నిజాయితీ నా అస్థిత్వం. దాన్ని కాపాడుకునేందుకు నేను చాలా కష్టపడుతున్నాను. నేను ఇప్పటి వరకు నా తండ్రి నుండి కూడా ఎలాంటి ఆర్థిక సాయంను పొందలేదు. నేను స్వతంత్య్ర భావాలు ఉన్న మహిళగా నా జీవితంను నేను గడుపుతున్నాను. కాని కొందరు మాత్రం నా ఆత్మ గౌరవంను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు. నేను హైదరాబాద్ లో కొనుగోలు చేసిన ప్లాట్ పూర్తిగా నా స్వర్జితం. ఈ వార్తలతో నా మాజీ భర్తకు సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అసు ఈ విషయం గురించి ఆయనకు తెలిసి ఉండక పోవచ్చు.

ఇలాంటి వార్తలను రాసేప్పుడు మీడియా సంస్థలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్థారించుకున్న తర్వాత ప్రచురించాలి. మీడియాలో వస్తున్న వార్తలతో నా మనుగడ ప్రమాదంలోకి పడుతుంది. ఒక ఒంటరి తల్లిగా నేను చాలా గౌరవంగా సమాజంలో జీవిస్తున్నాను. ఎవరి నుండి ఆర్థిక సాయం కూడా పొందకుండా నేను నా జీవితాన్ని పొందుతున్నాను. నా కుటుంబం కాని.. నా మాజీ భర్త నుండి కాని నేను అన్యాయంగా ఎలాంటి సాయంను పొందలేదని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. నా జీవితంలో మగాడి సాయం లేకుండానే ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి ప్రచారంతో నన్ను బలహీన పర్చవద్దంటూ రేణు ఎమోషనల్ అయ్యింది.
× RELATED పింక్ రిమేక్ పై రేణు దేశాయ్ హాట్ కామెంట్
×