ప్రియురాలికి ప్లేబోయ్ ప్రేమికుల రోజు కానుక

టీమిండియా ప్లేబోయ్ హార్ధిక్ పాండ్యా ప్రేమాయణాల గురించి తెలిసిందే. అరడజను మంది బాలీవుడ్ భామలతో ఎఫైర్లు సాగించాడు. అమైరా దస్తూర్.. నటాషా స్టాన్ కోవిక్.. ఎల్లీ అవ్ రామ్.. పరిణీతి.. ఊర్వశి రౌతేలా.. ఇషా గుప్తా  .. ఇలా వరుసగా భామల పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఇంతమంది భామల్లో ఎవరో ఒకరికి ఫైనల్ గా ఓకే చెప్పాలి కదా!  ఎట్టకేలకు తన లేడీ లవ్ ని ఫైనల్ చేసుకుని ఇటీవలే నిశ్చితార్థంతో అభిమానులకు సడెన్ షాకిచ్చాడు.  

2018 లో గాళ్ ఫ్రెండ్ నటాషాతో దుబాయ్ లో షికార్లు చేయడం బయటపడింది. అక్కడ సెలబ్రేషన్స్ అనంతరం తనకి లవ్ ప్రపోజ్ చేశాడని మీడియాలో ప్రచారమైంది. ఆ తర్వాత అదే విషయాన్ని బుల్లితెరపై కాఫీ విత్ కరణ్  షోలో హార్థిక్ ఎలాంటి భేషజం లేకుండా మాట్లాడుతూ ప్రస్థావించడం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక 2020 నాటికి హార్థిక్ - నటాషా జంట పెళ్లికి సిద్ధమైన విషయంపైనా క్లారిటీ వచ్చేసింది. రెండేళ్ల ప్రేమాయణం అనంతరం తమ నిశ్చితార్థాన్ని ఖాయం చేసుకున్నారు.

అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ లవ్ కపుల్ కెమిస్ట్రీ అభిమానుల్లో వైరల్ గా చర్చకువ చ్చింది. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా హార్దిక్ తన లేడీ లవ్ కి అద్బుతమైన కానుకను ఇచ్చాడట. ఓ బాల్కనీలో ఆ ఇద్దరూ కలిసి ఉన్నప్పటి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాల్లోకి వచ్చాయి. హాట్ లవ్ కపుల్ చూడముచ్చటైన ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నటాషాపై తన ప్రేమను చాటుతూ హార్థిక్ ప్రేమ పూర్వక సందేశాన్ని ఇచ్చాడట. ఇంతకీ ప్రేమికులరోజును పురస్కరించుకుని హార్థిక్ నటాషాకి ఎలాంటి కానుక ఇచ్చాడు? అంటే.. ఇదిగో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ప్రేమకు చిహ్నంగా.. లవ్ సింబల్ ని తలపించే డిజైన్ చేసిన ఎర్ర గులాబీల్ని  హార్థిక్ కానుకగా ఇచ్చాడు. నటాషాతో హార్థిక్ ప్లేబోయ్ లుక్ ప్రస్తుతం యూత్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


× RELATED ప్రేయసి రొయ్యల కూరకి లొట్టలేసాడట!