పాయల్ క్లాస్ మేట్ తోనే లవ్ లో పడిందా?

స్కూల్ డేస్ .. కాలేజ్ డేస్ ఎవరికైనా ఎంతో మెమరబుల్ గా ఉంటాయి. తెలిసీ తెలియని వయసు.. పైగా కౌమార దశలో మొగ్గ తొడిగే ప్రేమను నిలువరించడం అంత సులువేమీ కాదు. ఆ ఏజ్ లో ప్రేమలో పడడం .. అటుపై బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేయడం ఇవన్నీ మామూలే. అలాంటి తీపి జ్ఞాపకాలు ఆర్.ఎక్స్ బాంబ్ పాయల్ కి బోలెడన్ని. అయితే అవేవీ చెప్పకుండా దాచేస్తూ ఫ్యాన్స్ ని గందరగోళంలో పడేస్తోందేమిటో!

ఈ వేలెంటైన్స్ డే రోజున పాయల్ ప్రేమాయణానికి సంబంధించిన సింప్టమ్స్ కొన్ని బయటపడ్డాయి. పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా ఖాతాల్ని పరిశీలిస్తే.. దిల్లీలో చదువుకునే రోజుల్లో గమ్మత్తయిన ప్రేమ సాగించిందని అర్థమవుతోంది. తన స్కూల్ డేస్ స్నేహితుడు సౌరబ్ థింగ్రా తో లవ్ లో ఉంది. ఇటీవల సినీకెరీర్ తనని కొంత గందరగోళంలోకి నెట్టేయకపోతే ఈపాటికే దీనిపై ఓపెన్ అయ్యి ఉండేదే. గత కొంతకాలంగా సౌరబ్ తో పాయల్ చెలిమికి అనుబంధానికి సంబంధించిన ఫోటో లీకులు బయటపడుతూనే ఉన్నా.. తాను ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం ఎందుకనో బయట పెట్టడం లేదు పాయల్. దానికి కెరీర్ పరమైన అడ్డంకులు ఉంటాయని భావించి బయటకు చెప్పేందుకు ఆసక్తిగా లేదని అర్థమవుతోంది.

నిజానికి పాయల్ .. సౌరబ్ తో స్కూల్ డేస్ లోనే స్నేహం చేసింది. ఒకే స్కూల్లో ఒకే క్లాస్ అయినా ఆ ఇద్దరి బ్యాచ్ లు వేరట. అయితే వీటన్నిటిపైనా క్లారిటీ రావాలంటే పాయల్ స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ ప్రేమికుల రోజున తనకు సౌరబ్ ఏం కానుకిచ్చాడో ఈ అమ్మడు చెప్పనేలేదింకా. ఫ్యాన్స్ కి కనీసం క్లూ అయినా ఇస్తుందో లేదో! కెరీర్ పరంగా చూస్తే..  వెంకీమామతో హిట్ కొట్టిన పాయల్ ప్రస్తుతం కథలు వినే పనిలో బిజీగా ఉందిట.


× RELATED ప్రేమలో ప్రేమమ్ బ్యూటీ?
×