ఏంటి రౌడీ ఇది.. మరీ రొటీన్ గా ఉందే

యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  'ఓనమాలు'.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి సినిమాలను అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. రివ్యూస్ కూడా అశాజనకంగా లేవు.

సినిమా విడుదలకు ముందు విజయ్ సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశామని.. బాల్ స్టేడియం బయట పడుతుందో లేక బౌండరీ దగ్గర పడుతుందో తెలియదని ప్రస్తుతం మాత్రం బాల్ గాలిలో ఉందని చెప్పాడు. ఆ బాల్ ను బౌండరీ లోపలే ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.  సినిమాలో ఇల్లెందు ఎపిసోడ్ తప్ప మిగతా కథతో ఆడియన్స్ తో కనెక్ట్ కాలేకపోయారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక 'అర్జున్ రెడ్డి' ఛాయలు లేవని చెప్పారు కానీ సినిమాలో గౌతమ్ పాత్ర భావోద్వేగాలు అర్జున్ రెడ్డిని మాటిమాటికి గుర్తుతెస్తూ ఉంటాయి.

ప్రేమలో ఇబ్బందులు తలెత్తినప్పుడు విజయ్ పాత్ర ఎమోషన్స్ ప్రతి సినిమాలో ఒకేరకంగా ఉంటుయన్నాయని..  రొటీన్ గా కనిపిస్తోందని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  ఈ స్టైల్ కనుక మార్చకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.  మరి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్స్ట్ సినిమాలో ఈ అంశాల పట్ల విజయ్ జాగ్రత్త తీసుకుంటాడా అనేది వేచిచూడాలి.


× RELATED రౌడీని పట్టించుకోని ఓవర్సీస్ ప్రేక్షకులు
×