రౌడీ నిర్ణయం సూపర్ అంటున్న ఫ్యాన్స్

ప్లానింగ్ ప్రకారమో లేదా మనసులో అనిపించడం వల్లనో ఇకపై లవ్ స్టోరీస్ చేయనని పబ్లిక్ గా చెప్పేసాడు విజయ్ దేవరకొండ. మూడు ప్రేమకథల్లో నటించిన ఎక్స్ పీరియన్స్ తో బోర్ ఫీలయ్యి ఇక నుండి లవ్ స్టోరీస్ టచ్ చేయనని కరాఖండిగా చెప్పాడు. దీంతో రౌడీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన విజయ్ ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందనుకున్నారు.

కట్ చేస్తే 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చూసి మా రౌడీ నిర్ణయమే సూపర్ అంటూ కితాబిస్తున్నారు. దీనికి రీజన్ సినిమా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ లో ఉంటూ బోర్ కొట్టించడమే. ఇక మొన్నీ మధ్య వచ్చిన 'డియర్ కామ్రేడ్' కి కూడా ఇదే జరిగింది. సినిమాలో లవ్ ట్రాక్ బాగున్నా రెండో భాగం మరీ విసుగు తెప్పించింది. దాంతో థియేటర్స్ లో ప్రేక్షకులు కుర్చోలేని పరిస్థితి.

పూరితో కమర్షియల్ సినిమా చేస్తున్న విజయ్ ఇకపై కూడా అలాంటి  సినిమాలే చేయాలని  ఈ బోరింగ్ లవ్ స్టోరీస్ చేయకుండా మాట మీదే నిలబడి ఉండాలని అంటున్నారు. పబ్లిక్ టాక్ లో ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తూ రౌడీ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. మరి విజయ్ ఇదే మాటపై నిలబడి లవ్ స్టోరీస్ కి చెక్ పెట్టేస్తాడా చూడాల్సిందే.
× RELATED సీఎం జగన్ నిర్ణయానికి తొలిసారి పొగిడేసిన పవన్ కళ్యాణ్ । Pawan Kalyan Praises CM Jagan Decision
×