బ్రేకప్ బాధని తగ్గించే మందు ....వాలంటైన్స్ డే స్పెషల్ !

బ్రేకప్ అయ్యిందా ..బాధపడకండి ఈ మందు వేసుకోండి క్షణాల్లో మీ భాద మటుమాయం అవుతుంది అని డాక్టర్ బ్రూనెట్ చెప్తున్నారు. సాధారణంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అమ్మాయి/అబ్బాయి ఎవరైనా కానీ ...ఆ ప్రేమ నుండి బ్రేకప్ అయిన తరువాత ఆ మూడ్ లో నుండి బయటకి రావడం అంత సులభం కాదు. ఆ ప్రేమనే తలచుకుంటూ నిత్యం భాధపడుతుంటారు. పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) తో బాధ పడుతున్న అనేక మంది పై కెనడా కు చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ అలైన్ బ్రూనెట్ 15 ఏళ్లకు పైగా అధ్యయనం చేశారు. తాజాగా అయన ఈ భాద నుండి వారిని బయట పడేయడానికి ఒక సరికొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. అదే 'రీకన్సాలిడేషన్ థెరపీ' .

అధిక రక్తపోటును మైగ్రెయిన్ లాంటి రుగ్మతలకు చికిత్స కోసం చాలాకాలంగా ప్రొప్రనొలోల్ అనే ఔషధాన్ని వాడుతున్నారు. అయితే ఈ మందుతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ బ్రూనెట్ తన పరిశోధనలో కనుగొన్నాడు. ఆయన రూపొందించిన 'రీకన్సాలిడేషన్ థెరపీ'లో ముందుగా రోగికి ప్రొప్రనొలోల్ను ఇస్తారు. అనంతరం ఓ గంట తర్వాత వారితో తమ బాధాకరమైన జ్ఞాపకాలను వివరంగా రాసి పెద్దగా చదివి వినిపించాలి. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అప్డేట్ చేసి మళ్లీ సేవ్ చేసుకోవచ్చు అని ఈయన చెప్తున్నారు. అలాగే ఈ విధానం ద్వారా .. బాధితులకు వెంటాడుతున్న అత్యంత భావోద్వేగపూరితమైన అంశం ఏంటన్నది గుర్తించవచ్చని తెలిపారు.

"రోగులకు చికిత్స అందించేందుకు మనలో జ్ఞాపకాలు ఎలా రూపుదిద్దుకుంటాయి? అవి ఎలా అన్లాక్ అవుతాయి? ఎలా అప్డేట్ అయ్యి మళ్లీ మెదడులో నిక్షిప్తమవుతున్నాయి? అన్నది నాడీ శాస్త్రం నుంచి పొందిన అవగాహనతో అర్థం చేసుకుంటున్నాం" అని తెలిపారు. మరో విషయం ఏమిటంటే ఈ థెరపీ వల్ల పాత జ్ఞాపకాలేమీ మెదడు నుంచి పూర్తిగా తొలగిపోవు. కానీ అవి మనల్ని వేధించకుండా ఉంటాయి అని వెల్లడించాడు. ఈ థెరపీ ద్వారా 70 శాతం మంది బాధితులు చాలా వేగంగా ఉపశమనం పొందారని డాక్టర్ బ్రూనెట్ పరిశోధన తెలుపుతోంది.

అయితే ప్రేమ విఫలమవ్వడం వల్ల కూడా చాలామంది తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతుంటారు. ఏళ్లు గడిచినా... ఆ జ్ఞాపకాలను పదేపదే గుర్తు చేసుకుంటూ తీవ్రంగా బాధపడుతుంటారు. కాబట్టి వారికి కూడా ఈ థెరపీ చాలా బాగా పనిచేస్తుందని బ్రూనెట్ అంటున్నారు. తమ అధ్యయనంలో పాల్గొన్న విఫల ప్రేమికుల్లో చాలామంది ఒక్కసారి ఈ థెరఫీ చేయించుకోగానే ఆ బాధ నుంచి ఉపశమనం పొందారని డాక్టర్ బ్రూనెట్ ఆయనతో కలిసి పనిచేసిన డాక్టర్ లోనెర్గాన్ తెలిపారు. మీలో ఎవరైనా ప్రేమ లో విఫలమై ..ఆ జ్ణాపకాల నుండి బయటకి రాలేకపోతుంటే ..మీరు కూడా ఒకసారి రీకన్సాలిడేషన్ థెరపీ ని ట్రై చేయండి ..

× RELATED కుర్ర హీరోకి స్పెషల్ !
×