ఆ స్టార్ ప్రొడ్యూసర్ కు భయం పట్టుకుందట!

ఆయన టాలీవుడ్ లో ఒక బడా నిర్మాత. ఆయన ఇండస్ట్రీలో ఏం చెబితే అదే అన్నట్లుగా పాలిచేస్తున్నాడు. అలాంటి నిర్మాతకు తాజాగా షాక్ తలిగింది. ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన సినిమా కాస్త ఫెయిల్ అయ్యింది. ఆ సినిమాను విడుదలకు ముందే కొద్దో గొప్పో టేబుల్ ప్రాఫిట్ కు అమ్ముకున్నాడు. సినిమా హిట్ అయితే కోట్లు దండుకుందామని భావించాడు. కాని అది కాస్త ఫలితం రివర్స్ అయ్యింది. సీన్ రివర్స్ అవ్వడంతో ఆ నిర్మాత ప్రస్తుతం భయపడుతున్నాడట.

చిన్న ఫెయిల్యూర్ కే ఎందుకు భయం అనుకుంటున్నారా.. అసు విషయం ఏంటీ అంటే ఆ నిర్మాత ఎప్పుడు రీమేక్ చేసినా కూడా వర్కౌట్ అవ్వడం లేదు. గతంలో చాలా అంచనాలు పెట్టుకుని చేసిన రీమేక్ లు ఆయనకు నిరుత్సాహంను మిగిల్చాయి. ప్రస్తుతం కూడా మరో రీమేక్ ను ఆయన నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు నిర్మిస్తున్న రీమేక్ చిన్నా చితకా ప్రాజెక్ట్ కాదు. చాలా పెద్ద ప్రాజెక్ట్. స్టార్ హీరో ఆ రీమేక్ లో నటిస్తున్నాడు. కనుక ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటీ అనే ఆందోళనలో ఉన్నాడట.

ఏకంగా 75 కోట్ల పెట్టుబడితో ఆ రీమేక్ ను సదరు నిర్మాత నిర్మిస్తున్నాడని.. దాంతో ఇప్పుడు ఆ నిర్మాతకు భయం పట్టుకోవడంతో ఏం చేయాలో పాలుపోక నీళ్లు నములుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న రీమేక్ కు బడ్జెట్ కోత ఏమైనా పెడదామా అంటే స్టార్ హీరో అవ్వడం వల్ల అది సాధ్యం కాకుండా పోయింది. దాంతో సదరు నిర్మాత కక్క లేక మింగలేక అన్నట్లుగా ఉన్నాడు. మరో వైపు ఈ సినిమాతో ఆయన బ్యాడ్ సెంటిమెంట్  నుండి ఓవర్ కమ్ అయ్యే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు.


× RELATED భారీగా అప్పులు పాలై ఇల్లు అమ్మేసిన అగ్ర నిర్మాత | Top Producer in Deep Problems | i5 Network
×