పీఏకు ఖరీదైన కారును బర్త్ డే గిఫ్టుగా ఇచ్చిన గాయని

మీరొకరికి వద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఎంత బాగా కష్టపడినా.. మరెంత కమిట్ మెంట్ తో ఉన్నప్పటికీ.. మీ బర్త్ డే వేళ.. ఏమైనా గిఫ్టు వస్తుందా? అంటే చాలామంది లేదని చెబుతారు. కొందరు మాత్రం తమ కంపెనీ తమకు ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇస్తుందని చెప్పేటోళ్లు కనిపిస్తారు. కానీ.. అరుదుగా మాత్రమే జరిగే ఒక ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.

తన దగ్గర పని చేసే ముప్ఫై ఏళ్ల పీఏకు ఊహించని రీతిలో పుట్టిన రోజు బహుమతి ఇచ్చి సంచలనంగా మారారు ప్రముఖ గాయని మాడిసన్ బీర్. టీనేజ్ లోనే మంచి గాయనిగా గుర్తింపు పొందిన మాడిసన్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ లో మస్తు క్రేజ్ ఉన్న ఈ గాయని వద్ద 30 ఏళ్ల పీఏ పని చేస్తుంటారు.

ఉద్యోగంలో భాగంగా పన్నెండేళ్ల తన పాత కారును తీసుకొని నిత్యం వచ్చేందుకు పడుతున్న ఇబ్బందిని మాడిసన్ గుర్తించారు. అంతే.. ఆమె బర్త్ డేకు సర్ ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశారు. ఖరీదైన కారును ఆమెకు బహుమతిగా ఇవ్వాలని డిసైడ్ అయి.. న్యూ మెర్సిడెస్ బెంజ్ సీ300ను కానుగా ఇచ్చారు. పుట్టినరోజు వేళ.. ఊహించని విధంగా ఖరీదైన కారును సొంతం చేసుకున్న సదరు పీఏ ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి.


× RELATED ఫ్లైటే కాదు.. ట్రంప్ కారు.. హెలికాఫ్టర్ లెక్కే వేరు
×