అవును.. ఆ అమ్మాయిలిద్దరూ పెళ్లి చేసుకున్నారు

ప్రేమలో కొత్త లెక్కలు వచ్చేశాయి. మారుతున్న కాలానికి తగ్గట్లు ప్రేమలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఒకమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటామంటే కులం.. గోత్రం.. మతం.. జాతి ఇలాంటి రచ్చలు చాలానే ఉండేవి. అలా అని ఇప్పుడు లేవని కాదు కానీ.. గతంలో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. చాలా కుటుంబాల్లో కులమతాలకు ప్రాధాన్యత ను కాస్త తగ్గించారనే చెప్పాలి.

ఇలాంటివేళ.. ప్రేమలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమలు పెరగుతున్నాయి. ఇవి మరో అడుగు ముందుకు పడి పెళ్లి వరకూ వెళుతున్నాయి. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం ఏమిటి? అన్న క్వశ్చన్ కు చట్టం అండ సమాధానం గా ఉండటం తో కాస్త బయటకు వచ్చి పెళ్లి చేసుకోవటం మొదలైంది. తాజాగా అలాంటి సిత్రమైన పెళ్లి ఒడిశాలో చోటు చేసుకుంది.

ఆ అమ్మాయిలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఇద్దరూ ఒకేచోట చదువుకొన్నారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి..జీవితం మొత్తం కలిసి ఉండాలన్నట్లుగా వారి మధ్య బంధం పెరిగింది. పెరుగుతున్న వయసుకు తగ్గట్లే తమ ప్రేమబంధం పెరగటం తో పెళ్లి చేసుకోవాలన్ననిర్ణయానికి వచ్చారు. తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పటం.. షాక్ తో వారు నో చెప్పేయటం జరిగింది.

దీంతో.. వారిద్దరూ ఢిల్లీకి  వెళ్లి పోయారు. ఒక అమ్మాయి లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకుంది. అనంతరం స్నేహితుల సాయంతో వారు పెళ్లి చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్ గిరిలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు సంచలనంగా మారింది.
× RELATED అమ్మాయిలను చూస్తూ హస్త ప్రయోగం...క్రేజీ సీరియస్ 10 మంది అరెస్ట్!