హాఫ్ బికినీతో ఫ్యాన్స్ హర్టయ్యారు

హాఫ్ బికినీ ఇవాళ చూపించింది. ఫుల్ బికినీ ట్రీట్ ఎప్పుడు? ఏమో హనీ మాత్రం ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేసింది. ప్రేమికుల రోజు స్పెషల్ ఏదైనా ఉంటుందా? అని ఎదురు చూసిన అభిమానులకు ఇదిగో ఇలా హాఫ్ బికినీ ట్రీటిచ్చింది.

ఇంతకీ హనీ అలియాస్ మెహ్రీన్ ఎవరితో అయినా లవ్ లో ఉందా?  కనీసం ఎఫ్ 2 కొలీగ్ వరుణ్ తేజ్ తో అయినా టచ్ లో ఉందా? అంటే అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి క్లూ ఇవ్వనే లేదు. కెరీర్ ప్రారంభించి నాలుగైదేళ్లు అయినా కానీ యంగ్ బ్యూటీ మెహ్రీన్ కి ఎవరితోనూ ఎఫైర్ గోల అయితే లేదు. ఏదో ఉన్నామా పని పూర్తయిందా వెళ్లామా! అన్నట్టే ఉంటోంది తప్ప ఫలానా హీరోతో ఎఫైర్ సాగించింది అన్న రూమర్ కూడా రాలేదు. పక్కా ప్రొఫెషనల్ గా తన పనేదో తాను చూసుకుని వెళ్లిపోతోందన్నమాట.

వరుసగా నాని.. విజయ్ దేవరకొండ.. సాయి తేజ్.. వరుణ్ తేజ్ .. నాగశౌర్య ఇలా వరుసగా యంగ్ హీరోల సరసన నటించింది. కానీ ఎవరితోనూ ప్రేమా దోమా అనే గాసిప్ కూడా రాలేదు. ఇటీవలే యంగ్ హీరో నాగశౌర్య సరసన అశ్వథ్థామ చిత్రంలో నటించింది. తదుపరి పట్టాస్ లో ధనుష్ సరసన ఆడి పాడుతోంది. కెరీర్  ఆశించినంత స్పీడ్ గా లేకపోయినా అలా నెట్టుకొచ్చేస్తోంది. ఒకేసారి జెట్ స్పీడ్ తో టేకాఫ్ అయ్యేంత పెద్ద హిట్టు పడాల్సి ఉందింకా. అందుకే ఇంకా ఈ బ్యూటీ అనవసరమైన డైవర్షన్ ఏదీ లేకుండా వృత్తిపై కాన్ సన్ ట్రేట్ చేస్తోందనే భావించాలి మరి.


× RELATED ఈ హీరోల ఫ్యాన్స్ రచ్చ కూడా మొదలైంది
×