ప్రేమికుల దినోత్సవాన సో శాడ్!

వాలెంటైన్స్ డే స్పెషల్ ఏంటి? అంటే.. ఈరోజు ప్రేమ జంటలు కొత్త గూళ్లు వెతుక్కుంటూ ఎగిరిపోవడం సహజమే. అయితే ఈ స్పెషల్ డేని కత్రిన ఎలా సెలబ్రేట్ చేసింది? అంటే.. తనకు ఆ ఛాన్సే లేకుండా పోయింది. ఇప్పటికే రెండు సార్లు లవ్ బ్రేకప్ అయ్యింది. ఆ క్రమంలోనే హీరోలతో ప్రేమల జోలికి వెళ్లకుండా.. కేవలం స్నేహం మాత్రమే చేస్తోంది. ఎవరితోనూ కమిట్ మెంట్లు పెట్టుకునేంత అమాయకురాలు కాదిప్పుడు. అందుకే ఈసారి వేలెంటైన్స్ డే కత్రినకు రొటీన్ గానే గడిచిపోయింది.

అయితే ప్రేమికుల దినోత్సవాన్ని ఈ అమ్మడు వేరొక వ్యాపకానికి ఉపయోగించుకుంది. ప్రస్తుతం కత్రిన తన సొంత బ్రాండ్ ని బిల్డ్ చేస్తూ సౌందర్య సాధన ఉత్పత్తుల్ని మార్కెట్లో పాపులర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కే బ్రాండ్ గురించే ఏ నోట విన్నా. ఈసారి తాను ప్రమోట్ చేస్తున్న కార్పొరెట్ ఉత్పత్తులతో పాటు కత్రిన తన వోన్ బ్రాండ్ కి సంబంధించిన ప్రచారం చేసుకుంది. ఈసారి వాలెంటైన్స్ డేకి బదులుగా.. గ్యాలెంటైన్స్ డే జరుపుకుంది. ఈ కార్యక్రమంలో కొందరు అమ్మాయిలతో కలిసి స్పెషల్ గా ముచ్చటించింది. ఆ ముచ్చట్లలోనే తన అందానికి సంబంధించిన చాలా రహస్యాల్ని కత్రిన షేర్ చేసుకుంది. తాజాగా రిలీజైన ఫోటోల్లో కత్రినా  ఆఫ్-షోల్డర్ చిఫ్ఫోన్ వైట్ మాక్సీ దుస్తుల్లో కనిపించింది.

కెరీర్ సంగతి పరిశీలిస్తే.. కిలాడీ అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో అక్షయ్ పోలీసాఫీసర్ గా నటిస్తుంటే అతడికి భార్యగా కత్రిన నటిస్తోంది. గుల్షన్ గ్రోవర్- సికందర్ ఖేర్ -వివాన్ భటేనా తదితరులు నటిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కి రెడీ అవుతోంది.


× RELATED బ్రేకప్ బాధని తగ్గించే మందు ....వాలంటైన్స్ డే స్పెషల్ !
×