ఒంటికాలి ప్రపోజల్.. ఎంతైనా నితిన్ వెరైటీనే!

యూత్ స్టార్ నితిన్ స్నేహితురాలు షాలిని కందుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం తలి పరిచయం అయ్యింది. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ శుక్రవారం ప్రీవెడ్డింగ్ తో ఒకటి కాబోతున్నారు. అనంతరం ఎప్రిల్ 16న దుబాయ్ లో డెస్టినేషన్ తరహా  వెడ్డింగ్ జరగనుంది. అందుకోసం విలాసవంతమైన  ఖరీదైన  పలాజ్జో వెర్సస్  హోటల్ ని బుక్ చేసారు. ఈ వివాహానికి  కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితులు.. స్నేహితుల మాత్రమే హాజరవుతారు. అనంతరం హైదరాబాద్ లో సినీ రాజకీయ ప్రముఖులందరికీ గ్రాండ్ గా రిసెప్షన్  ఏర్పాటు చేయనున్నారు.

ప్రేమికుల రోజును పురస్కరించుకుని నితిన్ తమ ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పారు. ఈ ఐదేళ్ల లవ్ లో నితిన్ షాలిని ని ఎంతగా అర్ధం చేసుకున్నాడో.. తనను ప్రేయసికి తొలి ప్రపోజల్ ఎలా చెప్పాడో అన్ని సంగతుల్ని మీడియాకి రివీల్ చేశాడు. ఏడెనిమిదేళ్ల క్రితమే షాలిని-నితిన్ ఒకరినొకరు చూసుకున్నారుట. అదే తొలి కలయిక. ఆ తర్వాత ఒకరికొకరు అర్ధం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందిట.  ఆ తర్వాతే ఇద్దరి మనసులో ప్రేమ ఉందని...ఆ ప్రేమను పెళ్లి బంధంతో ఒకటి చేయాలని భావించినట్లు తెలిపారు.

నితిన్ ప్రియురాలికి ఒంటి కాలిమీద నిలబడి ప్రపోజ్ చేసాడుట. సాధారణంగా ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం అంటే మోకాలిపై కూర్చొని ప్లవర్ ఇచ్చి నిన్ను ఘాడంగా ప్రేమిస్తున్నా...విల్  యు మేరీ మీ అని అడుగుతారు. అటుపై గులాబీలతో ఘాడమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. కానీ నితిన్ అలా అడగలేదు. ఒంటి కాలిమీద నిలబడి ప్రపోజ్ చేసి  షాలినిని నవ్వించాడుట. షాలిని బ్రిటన్ లో బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యను అభ్యసించారు. ఇంతకీ ఈ జోడీ నిశ్చితార్థం ఎప్పుడు? అంటే పెళ్లికి ఒక రోజు ముందు (ఏప్రిల్ 15న) జరగనుందని తెలుస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసారు. ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లాడేస్తున్నారు. నితిన్ సో లక్కీ కదూ?


× RELATED వీడియో : మళ్లీ వైరల్ అవుతున్న సంయుక్త
×